హైదరాబాద్, వెలుగు: నగరంలోని అజీజ్‌నగర్‌లో 7 కలర్స్ కన్వెన్షన్ , స్టూడియో మొదలైంది. పలువురు సినీస్టార్లు, యాంకర్లు కార్యక్రమానికి హాజరయ్యారు. స్టూడియోలో కౌబాయ్, మొఘలాయ్, వైట్ ప్యాలెస్, రాజస్థానీ, బేబీ షూట్, విలేజ్ సెటప్‌లతో సహా 75కి పైగా ఎలక్ట్రిఫైయింగ్ థీమ్‌లు ఉన్నాయి. రాబోయే రోజుల్లో థీమ్‌లను 90 సెటప్‌లకు విస్తరిస్తామని స్టూడియో తెలిపింది. ఇక్కడ ఎయిర్ కండిషన్డ్ ఇండోర్ ఔట్ డోర్ స్పేస్‌లతో కూడిన కన్వెన్షన్ సెంటర్ కూడా ఉంది.
