ఈ ఏడు రకాల టీ తాగితే.. మెంటల్ హెల్త్ బాగుంటుంది

ఈ ఏడు రకాల టీ తాగితే.. మెంటల్ హెల్త్ బాగుంటుంది

ఉదయాన్నే కాఫీ, టీలు తాగే అలవాటు ఉన్న చాలామంది ఇకపై కాఫీ, టీలకు ప్రత్యామ్నాయంగా హెర్బల్ టీ తాగేందుకు ఆసక్తి చూపితే ఆరోగ్యంగా వుండవచ్చని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. హెర్బల్ టీ తాగడం వల్ల ఎలాంటి లాభాలు కలుగుతాయో తెలుసుకుందాం.  

ఉదయాన్నే కాసింత వేడి వేడి తేనీరు కడుపులో పడందే ఊపిరి సలపదు. చాలామంది బెడ్ టీ, బెడ్ కాఫీ అని తాగేస్తుంటారు. కాస్త తలపోటుగా అనిపించినా.. వెంటనే స్టౌ ఆన్‌చేసి గరగరం చాయ్‌ని తాగేస్తుంటారు. ‘టీ’కి ఉండే ప్రాధాన్యత అలాంటిది. లేబర్ వర్కర్ మొదలు.. కార్యాలయాల్లో పెద్ద పెద్ద ఉద్యోగుల వరకు టీ తాగనిదే పని ముందుకు కదలని పరిస్థితి ఉంటుంది. అంతలా బాడీని రిఫ్రెష్ చేస్తుంది టీ. అందుకే.. అందరూ టీ తాగేందుకు చాలా ఆసక్తి చూపుతారు. అయితే, హెర్బల్​ టీ తాగడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయంటున్నారు ఆరోగ్య నిపుణులు.  రకరకాల హెర్బల్​ టీ లతో.. రకరకాల ఆరోగ్యపరమైన ప్రయోజనాలు ఉన్నాయని చెబుతున్నారు.

హైబిస్కస్​  ( మందార )టీ :  దీంట్లో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. ఇది రక్తపోటు తగ్గిస్తుంది. రోగ నిరోధక శక్తి పెంచుతుంది. గుండె, కాలేయం ఆరోగ్యంగా ఉండేలా సాయపడుతుంది.  దీని రంగు ఎర్రగా ఉంటుంది. కొవ్వును తగ్గించే లక్షణాలు మందార టీలో పుష్కలంగా ఉన్నాయి. 

చమోమిలే ( చామంతి పూల)  టీ:   కాస్త దిగులుగా, ఒత్తిడిగా, అలసటగా ఉంటే ఈ చేమంతి టీ తాగితే ఉపశమనం ఉంటుంది. గొంతులో మంట, శ్వాస తీసుకోవడం లో ఇబ్బంది, పీరియడ్స్ సమయంలో వచ్చే నొప్పిని కూడా ఈ టీ తగ్గిస్తుంది. నిద్ర పట్టకపోతే ఒక కప్పు చేమంతి టీ తాగితే ఫలితం ఉంటుంది. ఇది చర్మ సమస్యల్ని దూరం చేయడంలో గొప్పగా పనిచేస్తుంది. . ఇది ఆన్‌లైన్‌లో కొనుక్కోవచ్చు.  చామంతి పూలని తీసుకొచ్చి ఆరబెట్టి ఈ టీని తయారు చేసుకోవచ్చు. స్టౌ మీద ఓ గ్లాసు నీటిని వేడి చేయండి. ఇందులో 2 లేదా 3 టేబుల్ స్పూన్ల ఎండిన చమోమిలే పువ్వులని జోడించండి. కొన్ని నిమిషాల పాటు బాగా మరిగాక వడకట్టి కొద్దిగా తేనె, నిమ్మరసం కలిపి తాగాలి.

లెమన్​ జింజర్ ( అల్లం)  టీ: లెమన్ టీని స్ట్రెస్ బర్నర్ అని కూడా అంటారు. 2004లో నిర్వహించిన క్లినికల్ ట్రయల్‌లో మానసిక ఒత్తిడితో బాధపడుతున్న కొంతమంది పాల్గొన్నారు. వారికి 600 mg లెమన్ టీని క్రమం తప్పకుండా అందిచారు. ఈ పరిశోధన ఫలితాలు చాలా సానుకూలంగా వచ్చాయి. ఇది కొలెస్ట్రాల్​ ను తగ్గించి.. చర్మ సంబంధవ్యాధుల నుంచి కాపాడుతుంది.
జింజర్ ( అల్లం)  టీ జీర్ణశక్తి పెంచడంలో, వాంతులు, తలతిరగడం లాంటి సమస్యలు తగ్గించడంలో అల్లం టీ ఉపయోగపడుతుంది. ఇది రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. వర్షాకాలంలో వచ్చే చిన్న చిన్న ఆరోగ్య సమస్యల్ని తగ్గిస్తుంది. 

  రోజ్ ( గులాబీ)​ టీ: ఒక కప్పు రోజ్ టీ ఆందోళనను తగ్గించడానికి, స్ట్రెస్‌ను కంట్రోల్‌ ఉంచడానికి సహాయపడుతుంది. గులాబీలోని పోషకాలు విశ్రాంతిని కలిగిస్తాయి, ఒత్తిడి స్థాయిలను తగ్గించడంలో, నిద్రను ప్రోత్సహించడంలో సహాయపడతాని అధ్యయనాలు చెబుతున్నాయి. నరాలను శాంతపరిచి ఒత్తిడి, ఆందోళనలనూ దూరం చేస్తుంది. రోజ్‌ టీ వేడిగా కంటే చల్లగా రుచి ఇంకా బాగుంటుంది. మహిళలకు ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. పీరియడ్స్​ సమయంలో వచ్చే నొప్పులను అరికడుతుంది. 

ALSO READ :- ఆర్టీసీ బ‌స్సుల్లేక విద్యార్థుల తిప్పలు

సేజ్ (తులసి)  టీ:  తులసిలో యాంటీ ఆక్సిడెంట్లు, రోగ నిరోధక శక్తి పెంచే ఏజెంట్లుంటాయి. శ్వాస సంబంధిత వ్యాధుల నుంచి ఉపశమనం ఇస్తుంది .  ఈ టీ చాలా రకాల ఇన్ఫెక్షన్ల నుంచి కాపాడుతుంది. తులసి టీ నిద్రలేమి సమస్యలను తగ్గిస్తుంది.  

రూయిబోస్ టీ: ఈ టీ శారీరక శక్తిని పెంచుతుంది. ఆరోగ్యకరమైన హృదయాన్ని ప్రోత్సహిస్తుంది. టాక్సిన్స్, ఫ్రీ రాడికల్స్‌ను శుభ్రపరుస్తుంది. బరువు తగ్గడానికి సహాయపడుతుంది. ఇది చర్మం స్థితిస్థాపకతను నిర్వహిస్తుంది. వృద్ధాప్యా చాయలు కనిపించకుండా చూస్తుంది.  ఇది రక్తపోటు, బరువు తగ్గడం, నిద్రను మెరుగుపరచడం, ఇన్‌ఫ్లమేటరీ ప్రేగు వ్యాధులు మొదలైనవాటిని తగ్గించడంలో గొప్పగా సహాయపడుతుంది. ఇది యాంటీ-అలెర్జీని కలిగి ఉంటుంది. తామర వంటి చర్మ సమస్యలను నయం చేస్తుంది.ఇది గుండె జబ్బుల ప్రమాదం తగ్గడానికి కూడా సహాయపడుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి.