కాబూల్ ఎయిర్ పోర్టులో తొక్కిసలాట.. ఏడుగురు మృతి

కాబూల్ ఎయిర్ పోర్టులో తొక్కిసలాట.. ఏడుగురు మృతి

తాలిబన్ల భయంతో వేరే దేశాలకు వెళ్లేందుకు అఫ్గాన్లు కాబూల్ విమానాశ్రయానికి భారీగా చేరుకుంటున్నారు. ఆదివారం కూడా పబ్లిక్ విపరీతంగా ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. దాంతో రద్దీని అరికట్టేందుకు తాలిబన్లు గాల్లోకి కాల్పులు జరిపారు. దాంతో ప్రాణభయంతో జనాలు పరుగులు తీయడంతో  తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాటలో ఏడుగురు చనిపోయారని బ్రిటన్ రక్షణ శాఖ తెలిపింది. అప్గానిస్థాన్ తాలిబన్ల చేతుల్లోకి వెళ్లిపోయిన తర్వాత వేలాది మంది పౌరులు దేశం విడిచివెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రతి రోజూ వేల సంఖ్యలో కాబూల్ ఎయిర్ పోర్టుకు తరలివస్తున్నారు. రద్దీని నియంత్రించడం అక్కడి భద్రతా దళాలకు పెద్ద సవాలుగా మారింది.