వలసకార్మికుల బస్సుకు ప్రమాదం.. ఏడుగురు మృతి

వలసకార్మికుల బస్సుకు ప్రమాదం.. ఏడుగురు మృతి

ఛత్తీస్‌గఢ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రాష్ట్ర రాజధాని రాయ్‌పూర్‌‌లో శనివారం తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతిచెందారు. ఒరిస్సాలోని గంజామ్ ప్రాంతం నుంచి గుజరాత్‌లోని సూరత్‌కు కూలీలను తీసుకువెళుతున్న బస్సును ట్రక్కు ఢీకొట్టింది. ఆ సమయంలో బస్సులో 59 మంది ప్రయాణిస్తున్నారు. ప్రమాదంలో ఏడుగురు చనిపోగా.. మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానికంగా ఉన్న అంబేద్కర్ ఆసుపత్రికి తరలించారు. కూలీలంతా గుజరాత్‌లోని ఓ బట్టల తయారీ కంపెనీలో పని చేసే వారిగా పోలీసులు గుర్తించారు. లాక్‌డౌన్‌లో స్వగ్రామాలకు వచ్చి .. అన్ లాక్ ప్రక్రియ మొదలుకావడంతో వీరంతా తిరిగి పరిశ్రమకు వెళ్తుండగా ఈ దుర్ఘటన జరిగిందని ఎస్పీ అజయ్ యాదవ్ తెలిపారు. రాంగ్ రూట్‌లో వేగంగా వచ్చిన ట్రక్ ఢీకొట్టడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని సమాచారం.

For More News..

సినీఫక్కీలో వెంటాడి యువకుడి దారుణ హత్య

హయ్యస్ట్ రికార్డ్.. దేశంలో తొలిసారిగా 86 వేలకు పైగా కరోనా కేసులు

రాష్ట్రంలో కొత్తగా 2,511 కరోనా కేసులు.. 11 మంది మృతి