విటమిన్ D కావాలా : వీటిలో ఏదో ఒకటి రోజూ తినండి.. హెల్దీగా ఉంటారు

విటమిన్ D కావాలా : వీటిలో ఏదో ఒకటి రోజూ తినండి.. హెల్దీగా ఉంటారు

పెరుగు, చీజ్ వంటి పాలు, పాల ఉత్పత్తుల్లో విటమిన్ డి ఉంటుందన్న విషయం చాలా మందికి తెలిసిందే. వీటితో పాటు రోజూ తీసుకునే ఆహారంలోనూ విటమిన్ డి ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. శాండ్ విచ్, పాస్తా, సలాడ్ లకు టాపింగ్ గా చీజ్ ను జోడించి విటమిన్ డిని పొందవచ్చని తెలుపుతున్నారు. దీంతో పాటు గుడ్డు సొనలోనూ ఈ విటమిన్ ఉంటుంది. సాధారణంగా రోజూ ఒక గుడ్డు తీసుకోవాలని వైద్యులు చెబుతుంటారు. అలా రోజూ వారి ఆహారంలో గుడ్డును తీసుకుంటే 6శాతం విటమిన్ డి లభిస్తుందని నిపుణులు చెబుతున్నారు.

పుట్టగొడుగులు

పుట్టగొడుగులు వాటి పెరుగుదల సమయంలో సూర్యరశ్మి లేదా అతినీలలోహిత కాంతికి గురైనపుడు సహజంగా విటమిన్ డిని కలిగి ఉంటాయి. కావున పుట్టగొడుగులను వివిధ వంటల్లో కలిపి తీసుకోవడం వల్ల అధిక మొత్తంలో విటమిన్ డి లభిస్తుంది.

ఆకుకూరలు

బచ్చలికూర లేక పాలకూర వంటి ఆకుకూరల్లో విటమిన్ డి ఉండదు. కానీ ఇందులో శరీరానికి అవసరమైన పోషకాలు లభిస్తాయి. సలాడ్ లు, ఆమ్లెట్ లలో ఈ ఆకుకూరలను చేర్చి తీసుకోవాలి. దీని వల్ల పోషకాలతో పాటు విటమిన్ డి సైతం శరీరానికి లభిస్తుంది.

తృణధాన్యాలు

అల్పాహారంగా తీసుకునే కొన్ని తృణధాన్యాల్లోనూ విటమిన్ డి పుష్కలంగా ఉంటుంది. అంతకంటే ముందు వీటిని కొనుగోలు చేసే ముందు వీటి ప్యాకేజీపై విటమిన్ డి అనే తెలిపే బ్రాండ్ ఉందో, లేదో ఒకసారి చెక్ చేసి తీసుకోవాలి. వీటిని ఉదయపు దినచర్యలో భాగం చేసుకుంటే తగిన ఫలితాలను పొందవచ్చు.

ALSO READ: ఇండియా తిరిగి వచ్చేసిన బుమ్రా.. : నేపాల్ మ్యాచ్ కు దూరం

బ్రోకలీ

బ్రోకలీ అనేది విటమిన్ డి అధికంగా లభించే వెజిటెబుల్. వంటల్లో జోడించడానికి ముందు దీన్ని ఉడికించి తీసుతోవాలి. ఇతర ఆహార పదార్థాలతోనూ బ్రోకలీని విరివిగా తీసుకోవచ్చు.