70 శాతం వడ్లు కొన్నం..  రివ్యూ మీటింగ్​లో మంత్రి ప్రశాంత్​రెడ్డి

70 శాతం వడ్లు కొన్నం..  రివ్యూ మీటింగ్​లో మంత్రి ప్రశాంత్​రెడ్డి

నిజామాబాద్​, వెలుగు: జిల్లాలో ఇప్పటి వరకు  70 శాతం వడ్ల సేకరణ పూర్తి అయ్యిందని   మంత్రి ప్రశాంత్​రెడ్డి తెలిపారు.  మిగిలిన 30శాతం వడ్లను వేగంగా కొనాలని అధికారులకు సూచించారు. సోమవారం సాయంత్రం ఆయన కలెక్టరేట్​లో  వడ్ల కొనుగోలుపై అధికారులతో రివ్యూ చేశారు.  జిల్లాలో ఎక్కడా అన్​లోడింగ్​ సమస్య రాకుండా చూడాలని అన్నారు. మిల్లుల దగ్గర  నియమించిన డిప్యూటీ తహసీల్దార్లు లంచ్​బాక్స్​లు తీసుకెళ్లి  రోజంతా అక్కడే ఉండాలని, అన్​లోడింగ్​లో సమస్యలు లేకుండా చూడాలని అన్నారు.  బోధన్, బాన్సువాడ నియోజకవర్గాల్లో  వడ్ల సేకరణ దాదాపు పూర్తయిందని,  అక్కడి హమాలీల సేవలను ఇతర చోట్ల  వాడుకోవాలన్నారు. గోదాములను గుర్తించాలన్నారు. కలెక్టర్​ రాజీవ్​గాంధీ హన్మంతు, అడిషనల్​ కలెక్టర్​ చంద్రశేఖర్​, డీఎస్ఓ చంద్రప్రకాశ్​ , డీసీఓ సింహాచలం, డీఆర్డీఓ  చందర్​, మెప్మా పీడీ రాములు ఆర్డీఓలు రాజేశ్వర్​, శ్రీనివాస్​, రవి వ్యవసాయ, మార్కెటింగ్​ అధికారులు ఉన్నారు.    

గ్రామీణ క్రీడాకారులకు గుర్తింపు  

 ప్రతిభగల గ్రామీణ క్రీడాకారులను గుర్తించి ప్రోత్సహించడానికి రాష్ట్రంలో ఫస్ట్​టైం చీఫ్ మినిస్టర్ కప్ - నిర్వహిస్తున్నట్టు  మంత్రి ప్రశాంత్ రెడ్డి తెలిపారు. స్థానిక  పోలీస్ పరేడ్ గ్రౌండ్​లో  సోమవారం జిల్లా స్థాయి  పోటీలను ఆయన ప్రారంభించారు.   జిల్లా నుంచి మలావత్ పూర్ణ, నిఖత్ జరీన్, యెండల సౌందర్య, గుగులోత్ సౌమ్య, హుసాముద్దీన్, ఇషాసింగ్  జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తున్నారని,  వారిని స్ఫూర్తిగా తీసుకోవాలని మంత్రి సూచించారు.   ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, జడ్పీ చైర్మన్ విఠల్​రావు, ఎమ్మెల్సీ రాజేశ్వర్​, కలెక్టర్ రాజీవ్ గాంధీ హన్మంతు, మేయర్​ నీతూకిరణ్​, నుడా  చైర్మన్ ప్రభాకర్ రెడ్డి, అడిషనల్​ కలెక్టర్లు చిత్రామిశ్రా, చంద్రశేఖర్, జిల్లా ఒలింపిక్ సంఘం అధ్యక్షుడు ఈగ సంజీవరెడ్డి, కార్యదర్శి బొబ్బిలి నర్సయ్య, ఆర్డీఓ రవి తదితరులు  పాల్గొన్నారు