70 ఏళ్ల వృద్ధుడు.. శిధిలాల కింద 34 గంటలు..

70 ఏళ్ల వృద్ధుడు.. శిధిలాల కింద 34 గంటలు..

తీవ్రంగా శ్రమించి కాపాడిన రెస్క్యూ టీమ్

ఇజ్మీర్: టర్కీలో శుక్రవారం  నాటి భూకంప ఘటనలో మరణించిన వారి సంఖ్య 53కు పెరిగింది. సుమారు 900 మంది గాయపడ్డారు. భూకంపం సంభవించిన సమయంలో కుప్పకూలిన బిల్డింగ్‌‌ శిథిలాల నుంచి సుమారు 34 గంటలు గడిచిన తరువాత అహ్మెట్‌‌ సిటిమ్‌‌ అనే 70 ఏండ్ల వృద్ధుడిని కాపాడారు. తొమ్మిది బిల్డింగ్స్‌‌ వద్ద సెర్చ్‌‌ ఆపరేషన్‌‌ను రెస్క్యూ టీమ్స్‌‌ కొనసాగిస్తున్నాయి. దేశంలో  మూడో అతిపెద్ద నగరంలో భూకంపం కారణంగా మరణించిన వారి సంఖ్య 51కి చేరిందని, సమోస్‌‌లో ఇద్దరు యువకులు మరణించారని టర్కీ వైస్‌‌ ప్రెసిడెంట్‌‌ ఫుయట్‌‌ ఆక్టే చెప్పారు. భూకంప తీవ్రతను యూఎస్‌‌ జియాలాజికల్‌‌ సర్వే 7.0 అని, ఇస్తాంబుల్‌‌ కండిల్లి ఇన్‌‌స్టిట్యూట్‌‌ 6.9గా చెప్పగా.. టర్కీ డిజాస్టర్‌‌‌‌ అండ్‌‌ ఎమర్జెన్సీ మేనేజ్‌‌మెంట్‌‌ ప్రెసిడెన్సీ మాత్రం భూకంప తీవ్రత 6.6గా నమోదైందని వెల్లడించింది.