ఒక్కసారి చార్జ్ చేస్తే 700 కిలోమీటర్లు..

ఒక్కసారి చార్జ్ చేస్తే 700 కిలోమీటర్లు..

ఎలక్ట్రిక్ కార్​ను డెవలప్​ చేస్తున్న ఆడీ

ప్రపంచమంతా ఎలక్ట్రిక్ వెహికల్స్ ట్రెండ్ షురూ అవుతోంది. ఇప్పటికే టెస్లా కంపెనీ ఈ–కార్ల తయారీలో అడ్వాన్స్‌‌గా ఉంది. భారత్‌‌లోకి కూడా ఈ కంపెనీ త్వరలో అడుగుపెట్టబోతోంది. అయితే ఈ కార్లు అనేక దేశాల్లో ఇంకా క్లిక్ అవ్వకపోవడానికి చాలా కారణాలు ఉన్నాయి. వాటిలో మేజర్ వీటి రేట్. సుమారు 75 లక్షల నుంచి కోటి రూపాయల వరకు పెడితే గానీ టెస్లా కార్లు కొనలేం. ఇక రెండోది.. లాంగ్ జర్నీలకు ఇవి సెట్ కావు. ఒక్కసారి ఫుల్ చార్జింగ్ పెడితే 300 నుంచి 400 కిలోమీటర్ల దూరం వెళ్లే కార్లు మాత్రమే ప్రస్తుతానికి అందుబాటులో ఉన్నాయి. అయితే ఇబ్బందిని అధిగమించడంలో జర్మనీకి చెందిన ఆడీ కార్ల కంపెనీ విజయవంతం అయింది. లాంగ్ జర్నీలకు సైతం ఉపయోగపడేలా ఒక్కసారి చార్జ్ చేస్తే 700 కిలోమీటర్లకు పైగా దూరం ట్రావెల్ చేసేలా ఏ6 ఈ–ట్రాన్ కారును డెవలప్ చేసింది. ఈ కారును షాంఘై మోటార్ షో వేదికగా ఆ కంపెనీ ప్రదర్శించింది. ఇంకా ఆ కారులో చాలా ప్రత్యేకతలు ఉన్నాయని కంపెనీ వెల్లడించింది.
లైట్స్‌‌తో గోడపై వీడియో గేమ్
ఆడీ ఏ6 కారు బ్యాటరీ చార్జింగ్ పెట్టుకోవడానికి పట్టే టైమ్ చాలా తక్కువే. అయినా ఆ కొద్ది టైమ్‌‌ కూడా బోర్‌‌‌‌ కొట్టకుండా ‘బిగ్ స్క్రీన్‌‌’పై వీడియో గేమ్స్ ఆడుకోవచ్చు. ఈ కారులో వాడిన డిజిటల్ మ్యాట్రిక్స్ ఎల్‌‌ఈడీ లైట్స్ సాయంతో ఈ స్పెషల్ ఫీచర్‌‌‌‌ను సెట్ చేశారు. ‘కారులో చిన్న ఎల్ఈడీ స్క్రీన్‌‌పై గేమ్ ఆడడంలో అంతగా ఫీల్, కిక్ ఉండదు. అందుకే కారుకు అడ్వాన్స్‌‌డ్ ఎల్ఈడీ బీమ్ లైట్స్ సెట్ చేశాం. వీటి సాయంతో ఎదురుగా గోడ ఉంటే బిగ్ స్క్రీన్ ఎక్స్‌‌పీరియన్స్ పొందవచ్చు. చార్జింగ్ పెట్టుకునేటప్పుడే కాదు, టైమ్ పాస్ కానప్పుడు కూడా కారు లోపల నలుగురూ కూర్చుని వీడియో గేమ్స్ ఎంజాయ్ చేసేలా ఇందులో సిస్టమ్ సెట్ చేశాం’ అని ఆడీ కంపెనీ వెల్లడించింది.
ఇండికేటర్స్ లైట్స్‌‌లోనూ స్పెషాలిటీ
ఇప్పటి వరకు ఉన్న ఏ కారులోనైనా టర్నింగ్స్ లేదా ఇతర సందర్భాల్లో ఇండికేటర్స్ ఆన్ చేస్తే దానికి ఉండే ఇండికేటర్ లైట్ మాత్రమే వెలుగుతుంది. ఆడీ లేటెస్ట్ ఎలక్ట్రిక్ కారులో ఇండికేటర్ ఆన్ చేస్తే లైట్ వెలగడమే కాదు.. రోడ్డుపైనా ఆ ఇండికేషన్ లైటింగ్ పడుతుంది. అంతేకాదు పక్కన ఖాళీ స్పేస్‌‌లో (గాలిలో) కూడా లైట్ కనిపిస్తుంది. వెహికల్ ఇండికేటర్స్ సరిగా గమనించలేని వారికి ఈ లైట్ కచ్చితంగా, క్లిస్టర్ క్లియర్‌‌‌‌గా కనిపిస్తుందని కంపెనీ చెబుతోంది. పగలు కూడా బాగా కనిపించేలా లైట్ స్టైల్, కలర్ అన్నీ కస్టమైజ్ చేసుకోవచ్చని తెలిపింది. డోర్స్ ఓపెన్ చేసేటప్పుడు లోపల ఉండే వాళ్లు ఒక్క అలర్ట్ ఇస్తే, లైట్స్ వెలగడంతో పాటు పెద్దగా వాయిస్ మెసేజ్ కూడా రావడం ఈ కార్ స్పెషాలిటీ. రోడ్‌‌పైనా వార్నింగ్ లైట్స్ డిస్‌‌ప్లే అవుతాయి.
రెండు హై పవర్ ఎలక్ట్రిక్ మోటార్లు..
ఆడీ ఏ6 కారు చాలా స్పీడ్‌‌గా పికప్ అందుకుంటుంది. కేవలం నాలుగు సెకండ్లలోనే 100 కిలోమీటర్ల స్పీడ్‌‌కు పుంజుకుంటుంది. ఈ కారులో రెండు ఎలక్ట్రిక్ మోటార్స్ వాడినట్లు కంపెనీ తెలిపింది. 476 హార్స్‌‌పవర్ ఉండే రెండు ఎలక్ట్రిక్ మోటార్స్ ఈ కారులో ఫిట్ చేశారు. దీని హై పవర్ వల్లే అంత ఫాస్ట్‌‌ పికప్ సాధ్యమవుతుంది. ఈ కారులో హై స్పీడ్ 245 కిలోమీటర్స్ పర్ అవర్. ఈ స్పీడ్‌‌ను కూడా ఏడు సెకన్లలోనే అందుకుంటుంది.
రేట్ 83 లక్షలు
ఆడీ ఏ6 ఈ–ట్రాన్ కారు రేట్ సుమారు 83 లక్షల రూపాయల వరకు ఉండే చాన్స్ ఉంది. దీని ప్రొడక్షన్‌‌ను వచ్చే ఏడాదిలో మొదలు కాబోతోంది. మార్కెట్‌‌లోకి 2023 నాటికి వస్తుందని కంపెనీ చెబుతోంది. నాలుగు డోర్లు ఉండే ఈ కారు, 4.96 మీటర్ల పొడవు, 1.96 మీటర్ల వెడల్పు ఉంటుంది.

10 నిమిషాల చార్జింగ్‌‌తో 300 కిలోమీటర్లు
ఆడీ కొత్త కారులో అడ్వాన్స్‌‌డ్ టెక్నాలజీ వాడడం వల్ల తక్కువ టైమ్‌‌లో ఎక్కువ చార్జింగ్ అవ్వడంతో పాటు బ్యాటరీ కెపాసిటీ కూడా ఎక్కువగా ఉంటుందని కంపెనీ వెల్లడించింది. మిడ్ రేంజ్ లగ్జరీ కార్లలో ఇదొక రెవల్యూషన్ కాబోతోందని షాంఘై ఎక్స్‌‌పోలో కంపెనీ ప్రతినిధి చెప్పారు. 800 వోల్ట్ చార్జింగ్ టెక్నాలజీని వాడడం వల్ల చాలా కొద్ది టైమ్‌‌లోనే 270 కిలోవాట్స్ పవర్ చార్జ్ అవుతుంది. కేవలం 25 నిమిషాల్లోనే బ్యాటరీ 80 శాతం అంటే 100 కిలోవాట్స్ చార్జింగ్ పూర్తవుతుంది. ఇక పది నిమిషాల్లో బ్యాటరీ 300 కి.మీ. ట్రావెల్ చేయడానికి సరిపడా చార్జింగ్ ఎక్కుతుంది. అదే ఫుల్ చార్జింగ్​తో 700 కిలోమీటర్లు ప్రయాణం చేయొచ్చు.