24 గంటల్లో 70,589 కేసులు.. 776 మంది మృతి

24 గంటల్లో 70,589 కేసులు.. 776 మంది మృతి

భారత్  వారం  క్రితం ప్రతి రోజు దాదాపు 90 వేలకు పైగా కేసులు..1000 మరణాలు నమోదయ్యేవి. కానీ గత వారం రోజులుగా కేసుల సంఖ్య క్రమేపి తగ్గుతుంది. ప్రతి రోజు దాదాపు 80 వేల కేసులు నమోదవుతున్నాయి. అయితే ఇంతకు ముందు రోజుకు 12 లక్షల టెస్టులు చేసేవారు.  కరోనా కేసుల సంఖ్య తగ్గడానికి తక్కువ టెస్టులు చేయడం కారణం అనుకున్నా..మరణాల సంఖ్య తగ్గడం కాస్త ఊరటనిస్తుంది.

దేశంలో గడిచిన 24 గంటల్లో 70,589  కొత్త కేసులు నమోదవ్వగా  776 మంది చనిపోయారు. వీటితో  దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య  61,45,292 కు చేరగా మరణాల సంఖ్య 96,318 కు చేరింది. ఇక నిన్న ఒక్కరోజే 84,877 మంది కోలుకోవడంతో డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 51,01,398 కి చేరింది. ఇంకా 9,47,576 మంది చికిత్స తీసుకుంటున్నారని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. దేశంలో నిన్న 11,42,811 టెస్టులు చేయగా సెప్టెంబర్ 28 నాటికి కరోనా టెస్టుల సంఖ్య 7,31,10,041 కు చేరాయని ఐసీఎంఆర్ ప్రకటించింది.

తెలంగాణలో కొత్తగా 2072 కేసులు..9 మంది మృతి