28 ఏళ్ల తరువాత ఇండియలో మిస్​ వరల్డ్​ పోటీలు

 28 ఏళ్ల తరువాత ఇండియలో మిస్​ వరల్డ్​ పోటీలు

ప్రపంచ దేశాల అందగెత్తలు పాల్గొనే మిస్ వరల్డ్ పోటీలు ఈసారి మన భారతదేశంలో జరగనున్నాయి. ఈ వేడుకలకు ముంబైలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్ వేదికగా మారనుంది. .28 ఏళ్ల తర్వాత 71వ మిస్ వరల్డ్ పోటీలకు ఆతిథ్యం ఇవ్వడానికి భారత్ సిద్ధమైంది.

 ప్రపంచం మొత్తాన్ని ఎందురుచూసేలా చేసే కాంపిటీషన్ మిస్ వరల్డ్. ప్రతి సంవత్సరం వేర్వేరు దేశాల్లో జరిగే ఈ పోటీల గురించి ఇంట్రెస్టింగ్ న్యూస్ అందింది. అదేంటంటే.. ఈ సారి పోటీలు ఇండియాలో జరగనున్నాయి.

ప్రపంచంలోని అందగత్తెలు అందరూ ఓ చోట చేరడం.. అందులో ఒకరు విన్నర్ అవ్వడం. ఈ వేడుకని చూసేందుకు ప్రతి ఒక్కరు సిద్ధమవ్వడం.. ఇలా ఉంటుంది ప్రతి సంవత్సరం పరిస్థితి. అందాల పోటీల్లో ఏ దేశపు అందగత్తె కిరీటాన్ని అందుకుంటుందని అందరూ కూడా ఆతృతగా ఎదురుచూస్తుంటారు. ఈ నేపథ్యంలోనే ఆ కాంపిటీషన్ వివరాలు ఎప్పటికప్పుడు తెలుసుకుంటారు. ఈ నేపథ్యంలోనే ఈ సంవత్సరం మిస్ వరల్డ్ పోటీలు ఇండియాలో జరుగుతున్నాయి. 

ఇండియాలో 71 వ అందాల పోటీలు 

28 సంవత్సరాల తర్వాత  మిస్ వరల్డ్ 2024 పోటీలు  71వ ఎడిషన్ గ్రాండ్ ఫినాలే భారతదేశంలో జరుగుతుంది.  మిస్ వరల్డ్ 1951లో యునైటెడ్ కింగ్‌డమ్‌లో ఎరిక్ మోర్లీ స్థాపించారు.  దశాబ్ధాలుగా ఈ ఐకానిక్​ పోటీలు ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నాయి.   ఫెస్టివల్ బికినీ కాంటెస్ట్ అని పిలిచే  ఈ ఈవెంట్ బ్రిటిష్ ప్రెస్ ప్రచార బాధ్యతలు నిర్వహించింది.  మొదటి సారి నిర్వహించినప్పుడు స్వీడన్‌కు చెందిన కెర్‌స్టిన్ “కికీ” హకాన్సన్ మొట్టమొదటి మిస్ వరల్డ్‌గా కిరీటాన్ని అందుకున్నారు.

మిస్ వరల్డ్ ఆర్గనైజేషన్ 

వార్షిక మిస్ వరల్డ్ ఫైనల్స్‌ను పర్యవేక్షించే బాధ్యత కలిగిన మిస్ వరల్డ్ ఆర్గనైజేషన్, పోటీని ప్రపంచంలోనే అతిపెద్ద ఈవెంట్‌లుగా మార్చింది. ఈ సంస్థ వికలాంగులు .. వెనుకబడిన పిల్లలకు సాయం చేసేందుకు  స్వచ్ఛంద సంస్థల నుంచి విరాళాలు సేకరించింది .  100 కంటే ఎక్కువ దేశాలలో ఫ్రాంచైజీలతో, మిస్ వరల్డ్ అందాన్ని మించిన ప్రపంచ వేదికగా మారుతుంది.

28సంవత్సరాల తర్వాత..

దాదాపు 28 సంవత్సరాల తర్వాత ఈ అందాల పోటీలు ఇండియాలో జరుగుతున్నాయి. 1996లో ఇండియాలో ఈ పోటీలు జరగగా అందులో గ్రీస్‌కి చెందిన ఇరెనా స్క్లీవా కిరీటాన్ని గెలుచుకుంది. ఆ పోటీల్లో భారత్ టాప్ 5లో నిలిచింది. ఆ తర్వాత ఇప్పుడు మళ్ళీ ఈ మిస్ వరల్డ్ పోటీలకు ఇండియా వేదిక కానుందని మిస్ వరల్డ్ ఆర్గనైజేషన్ చైర్ పర్సన్ అండ్ సీఈఓ జూలియా మూర్లే, గతేడాది విన్నర్ కరోలినా బిలావ్స్కా తెలిపారు. గతేడాది మిస్ వరల్డ్ పోటీలు ప్యూర్టోరికోలో జరిగాయి. కరెబియన్ ఐలాండ్స్‌లోని శాన్ జువాన్‌లో జరిగిన మిస్ వరల్డ్  పోటీల్లో పోలాండ్ సుందరి కరోలినా బిలావ్స్కా కిరీటాన్ని సొంతం చేసుకుంది. దీంతో ఆ దేశానికి రెండోసారి ఈ కిరీటం దక్కింది.

ALSO READ :- బైరామల్ గూడ రెండవ ఫ్లైఓవర్ ప్రారంభించిన సీఎం రేవంత్

ప్రపంచ దేశాలు అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే ఈపోటీలు చాలా ఏళ్ల తర్వాత మన దేశంలో నిర్వహించడంతో ఈపోటీలు మరింత ఆసక్తికరంగా మారాయి.ఆ ప్రపంచ సుందరి పోటీలను భారత్ లో నిర్వహించే బాధ్యతను ఇండియా టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ITDC) తీసుకుంది. ఈ ఏడాది ఫిబ్రవరి 20న న్యూఢిల్లీలోని హోటల్ అశోక్‌లో ‘ది ఓపెనింగ్ సెర్మనీ’ నిర్వహించింది.  ‘ఇండియా వెల్‌కం ది వరల్డ్ గాలా’తో వేడుకలను ప్రారంభించింది. మిస్ వరల్డ్ పోటీలో వరల్డ్ టాప్ డిజైనర్ అవార్డు, మిస్ వరల్డ్ టాప్ మోడల్, మిస్ వరల్డ్ స్పోర్ట్స్ ఛాలెంజ్, మిస్ వరల్డ్ టాలెంట్ ఫైనల్, మల్టీ మీడియా ఛాలెంజ్ , హెడ్ టు హెడ్ ఛాలెంజ్ ఫైనల్ ఉన్నాయి.ప్రపంచ దేశాలు అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే ఈపోటీలు చాలా ఏళ్ల తర్వాత మన దేశంలో నిర్వహించడంతో ఈపోటీలు మరింత ఆసక్తికరంగా మారాయి.