Telangana History : బైరాన్ పల్లి వీరోచిత పోరాటానికి 75 ఏళ్లు.

Telangana History : బైరాన్ పల్లి వీరోచిత పోరాటానికి 75 ఏళ్లు.

బైరాన్​ పల్లి.. ఇది సిద్దిపేట జిల్లా మద్దూరు మండలంలోని ఒక ఊరు. మాత్రమే కాదు.. నిజాం కాలంలో రజాకార్ల గుండెల్లో రైళ్లు పరిగెత్తించిన పల్లె రజాకార్ల ఆగడాలను భరించలేక పిడికిళ్లు బిగించి.. వడిశెల రాళ్లతో జవాబు చెప్పిన యోధులను కన్న ఊరు. రజాకార్లకు ఎదురు నిలిచి నెత్తురు చిందించిన పల్లెల్లో ఒకటి. సరిగ్గా 75ఏళ్ల క్రితం ఇక్కడ జరిగిన మారణకాండ అమృత్ సర్లో జరిగిన జలియన్ వాలాబాగ్ ఘటనను గుర్తుచేసింది. 119 మంది యోధులు నేలకొరిగారు.

బైరాన్​ పల్లిలో  అడుగు పెట్టగానే అమరుల స్థూపం కనిపిస్తుంది. ఇది రజాకార్ల తూటాలకు బలైన అమరుల త్యాగాలను గుర్తు చేస్తుంది. పల్లెల మీద పడి దౌర్జన్యాలు చేసిన రజాకార్లకు బుద్ధి చెప్పిన వీరుల స్మృతులను కళ్లకు కడుతుంది. ఊరి బురుజు ఆనాటి మారణకాండకు నిలువెత్తు సాక్ష్యం.

1947 ఆగష్టు 15న మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చింది. దేశ ప్రజలంతా స్వేచ్ఛా వాయువులు పీల్చుకుంటున్నారు. కానీ నిజాం పాలనలో ఉన్న తెలంగాణ ప్రజలు మాత్రం ఇంకా రాచరికపు కంచెలోనే జీవితం గడుపు తున్నారు. రజాకార్ల అగడాలకు బిక్కు బిక్కుమంటూ  కాలం వెళ్లదీస్తున్నారు. రజా కార్ల దౌర్జన్యాలను ఎదుర్కొ నేందుకు ప్రజలు గ్రామ రక్షణ దళాలను ఏర్పాటు చేసుకున్నారు. అదే టైంలో బైరాన్ పల్లి దగ్గ రలో ఉన్న లింగాపూర్, దూలోల్మిట్ట  గ్రామాలపై రజాకార్లు దాడి చేశారు. ఎంతోటే మందిని చంపి గ్రామాన్ని లూటీ చేసి ఆ సామగ్రిని తీసుకుని తిరుగు ప్రయాణమయ్యారు. వాళ్లు బైరాన్​ పల్లి మీదుగా వెళ్తుండగా బైరాన్ పల్లి గ్రామ రక్షణ దళం అడ్డుకుని రజాకార్లపై దాడి చేసింది. వాళ్లు భయంతో సామాగ్రిని బైరాన్ పల్లిలోనే వదిలేసి వెళ్లిపోయారు. దాంతో బైరాన్​పల్లిపై కక్ష కట్టిన రజాకార్లు రెండు సార్లు దాడి చేశారు. కానీ విఫలమయ్యారు. ఈ దాడుల్లో 20 మంది రజాకార్లు చనిపోయారు. దాంతో అప్పటి భువనగిరి డిప్యూటీ కలెక్టర్ హసీం, పల్లి తిరుగుబాటు గ్రామంగా ప్ర కటించారు. అంతేకాదు ఎప్పటికైనా బైరాన్ పల్లిని మట్టుబెడతానని ప్రతిజ్ఞ చేశారు.

కక్ష పెంచుకున్న రజాకార్లు మళ్లీ దాడి చేసే ప్రమాదం ఉందని, గ్రామంలో ఎవరూ ఉందొడ్డని గ్రామ రక్షణ దళానికి... దళం పంపిన వార్త చేరలేదు. ఆ ఊరివాళ్లంతా ఎప్పటిలాగే ధీమాతో ఉన్నారు. గ్రామం నడిబొడ్డున ఉన్న బురుజు ప్రధాన రక్షణ కేంద్రంగా చేసుకున్నారు. అది 1948 ఆగష్టు 27. ఉదయం 4 గంటలు అవుతోంది. పల్లె ఇంకా నిద్ర మత్తు లోనే ఉంది. అంతలోనే తుపాకీ మోత, తోపుల పేళుళ్ల శబ్దం వినిపించాయి. ఎలర్ట్​అయ్యేలోపే చావు కేకలు కూడా వినిపించాయి. ఊరంతా ఉబిక్కిపడింది. ఏం జరుగుతోందో తెలియని అయోమయం.. తేరుకుని చూస్తే.. రజాకార్లు గతంలో జరిగిన అవమానానికి ప్రతీకారం తీర్పు కునేందుకు వచ్చారు. సుమారు 1,200 మంది రజాకార్లు మందుగుండు సామగ్రి, తుపాకులతో దొంగచాటున బైరాన్ పల్లిలోకి ప్రవేశించారు. రజాకర్ల కదలికలను ఎప్పటికప్పుడు గ్రామరక్షణ దళానికి చేరవేసే గ్రామ కావరి విశ్వనాధ్ బట్ జోషి రజాకార్లకు దొరికిపోయాడు.   అందుకే వాళ్లు ఊరిని చుట్టుముట్టే వరకు దళానికి విషయం తెలియలేదు. ఉల్లింగల వెంకటనర్సయ్య అనే గ్రామస్తుడిని రజాకార్లు పట్టుకోగా అతడు తప్పిం చుకుని వచ్చి రజాకార్లు గ్రామంలోకి చొరబడ్డారని అందరికీ వినపడేటట్టు కేకలు వేశాడు. దీంతో గ్రామంలోని బురుజు మీద ఉన్న దళ కమాండర్ రాజిరెడ్డి అందరినీ ఎలర్ట్​ చేసేందుకు నగారా మోగించాడు కానీ అంతలోపే జరగాల్సిందంత  జరిగిపోయింది. దాడిని తిప్పికొట్టేందుకు బురుజుపై కాపలాగా ఉన్న మోటం రామయ్య. పోచయ్య బలిజ భూమయ్యలు రజాకర్ల తుపాకి గుండ్లకు బలయ్యారు. 

గ్రామం లోపలికి వచ్చిన రజాకార్లు దొరికినోళ్లను దొరికినట్లుగా కాల్చి చంపారు. అంతటితో ఆగలేదు. ఇంటింటికీ తిరిగి 92 మందిని చేతికి పట్టుకుని పరుసగా నిలబెట్టి కాల్చిచంపారు. గ్రామం బయట శవాల చుట్టూ ఆడవాళ్లను వివస్థలుగా చేసి బతుకమ్మ ఆడించారు. ఆ అవమానాన్ని తట్టుకోలేక కొంతమంది ఆడవాళ్లు ఆత్మహత్య చేసుకున్నారు.

 తెలంగాణ సాయుధ పోరాటంలో వీరబైరాన్ పల్లిలోని ప్రతి ఒక్కరు ప్రత్యక్షంగా, పరోక్షంగా పాల్గొన్నారు. ఇంతపెద్ద ఎత్తున సాగిన వీరోచిత పోరాటాలు ఘటనలను ఇప్పటి పాఠ్యాంశాల్లో చేరిస్తే బాగుండేదని గ్రామస్తులు అంటున్నారు. గ్రామంలో చిహ్నాన్ని ఏర్పాటు చేయాలని, వీర బైరాన్ పల్లిని ఒక టూరిస్టు కేంద్రంగా డెవలప్ చేయాలని వాళ్లు కోరుతున్నారు. నాటి వీరోచిత పోరాటాంలో పాల్గొన్న కుటుంబాలకు పింఛన్ అందడంలేదంటున్నారు. ఇక్కడ అమరథా మం నిర్మించాలని, అమరవీరుల స్మారకార్థం.. లైబ్రరీని, కమ్యూనిటీ హాలుసు కట్టించాలని కో దుతున్నారు. చారిత్రక సంఘటనలకు వేదికగా ఉన్న బురుజు నేను శిధిలమైపోయిందని, దీనిని పరిరక్షించాలంటున్నారు.


 150 మందికి పైనే

ఈ 2దాడాలో 25 మంది రజాకార్లు, 119మంది పోరాట యోధులు చనిపోయారని రికార్డుల్లో ఉంది. కానీ ఆ సంఖ్య 150కిపైనే ఉంటుందని అప్పటివాళ్లు చెప్పారు. ఆ తర్వాత రజాకార్లు కూటిగల్ గ్రామంపై కూడా దాడి చేసి 30 మందిని పొట్టన పెట్టుకున్నారు. వీర తెలంగాణలో ఇలాంటి వీరులను కన్న పల్లెలు ఎన్నో ఉన్నాయి. రజాకార్ల తూటాలకు ఎదురు నిలిచిన పోరాట యోధులు ఎందరో ఉన్నారు. వాళ్ల త్యాగాలే సాయుధ పోరాటలకు స్పూర్తినిచ్చాయి. ప్రస్తుతం ఊల్లో సాయుధ పోరాటాల్లో పాల్గొన్న కుటుంబాలు 70 ఉన్నాయి. వాళ్లకు ఇస్తే బాగుంటుందని స్థానిక నేతలు అంటున్నారు.


70 ఏళ్లుగా ఎదురు చూస్తున్నం

తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొన్న మాకు ఎవరూ సాయం చేయడం లేదు. ప్రత్యక్షంగా ఎదురుదెబ్బలు తిన్న మా కుటుంబాలు ఆగమయినయ్..స్వాతంత్ర సమరయోధుల పెన్షన్అందిస్తే బాగుండేది. ఇంకెప్పుడిస్తారని అంటున్నారు. 

ఎన్నో దెబ్బలు తిన్నం

ఆనాటి పోరాటాల్లో పాల్గొన్న మాకు ఇప్పటివరకు పెన్షన్ లేదు. రజాకార్ల చేతుల్లో ఎన్నో దెబ్బలు తిన్నాం. ఏ ప్రభుత్వం కూడా మమ్మల్ని పట్టించుకోవడంలేదు. 70 ఏళ్లనుంచి ఎదురు చూస్తున్నం. బతికుండగా మమ్మల్ని ఎవరైనా ఆదుకుంటారా అని ఎదురు చూస్తున్నాం.. పెన్షన్ మంజురు చేయాలని బైరాన్​ పల్లి ప్రజలు కోరుతున్నారు,