75 ఏళ్ల స్వాతంత్ర్య స్ఫూర్తి, భారత్ విజయాలను ప్రపంచానికి చాటుదాం

75 ఏళ్ల స్వాతంత్ర్య స్ఫూర్తి, భారత్ విజయాలను ప్రపంచానికి చాటుదాం

75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు స్వాతంత్ర్య పోరాటాన్ని రిఫ్లెక్ట్ చేసేలా, ఫ్రీడమ్ ఫైటర్స్ కి నివాళులర్పించేలా ఉండాలన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. అలాగే స్వాతంత్ర్య పోరాట యోధులు దేశాన్ని ఎలా నిర్మించాలనుకున్నారో తెలియజేసేలా వేడుకలు జరగాలన్నారు. వేడుకల నిర్వహణ కోసం ఏర్పాటు చేసిన కమిటీ సభ్యులతో మోడీ మాట్లాడారు. దేశంలో 75వ స్వాతంత్ర్య వేడుకలు జరుపుకునే సమయంలో... గతంలో అసాధ్యం అనిపించిన లక్ష్యాలను సాధించేందుకు బోల్డ్ స్టెప్స్ తీసుకుంటుందని మోడీ చెప్పారు. దేశ స్వాతంత్ర్య పోరాట స్ఫూర్తిని, 1947 నుంచి భారత్ సాధించిన విజయాలను ప్రపంచానికి చాటేలా 75వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని నిర్వహిస్తామని తెలిపారు ప్రధాని నరేంద్ర మోడీ.