
దేశంలో అత్యంత చిన్న వయసున్న శిశువు కి కరోనా తగ్గింది. కోల్ కతా కు చెందిన దంపతులు ఓ బిడ్డకు జన్మనిచ్చారు. 40 రోజుల ఆ శిశువుకు జ్వరం, మూర్చ, ఊపిరి ఆడకపోవడంతో తల్లిదండ్రులు కోల్ కతా ఇనిస్టిట్యూట్ ఆఫ్ చైల్డ్ హెల్త్ కేర్ కు చెందిన డాక్టర్లను సంప్రదించారు. టెస్ట్ లు చేసిన వైద్యులు ఐసీయూ కి తరలించారు. జులై 30న మరోసారి చిన్నారికి టెస్ట్ లు చేయడంతో కరోనా వైరస్ సోకినట్లు నిర్ధారించారు. దీంతో అత్యవసర చికిత్స నిమిత్తం మరో ఆస్పత్రికి చెందిన చిన్న పిల్లల కరోనా వార్డ్ కు తరలించే ప్రయత్నం చేశారు. అయితే ఐసీయూనుంచి బయటకు తెస్తే శిశువు చనిపోతుందని అనుమానం వ్యక్తం చేసిన డాక్టర్లు అక్కడే ఉంచారు. కానీ డాక్టర్లకు ఇది సవాల్ గా మారింది. ఇంత చిన్న వయస్సులో కరోనా సోకిన చిన్నారికి ట్రీట్మెంట్ చేయడం కత్తిమీద సామే అయినా డాక్టర్లు ఆందోళన చెందలేదు. ఛాలెంజ్ గా తీసుకొని చిన్నారికి ట్రీట్మెంట్ అందించారు. సరిగ్గా 8రోజుల తరువాత చిన్నారి ఆరోగ్యం కుదుట పడడంతో కరోనా టెస్ట్ లు చేశారు. ఈ టెస్ట్ ల్లో నెగిటీవ్ వచ్చిందని, ఈరోజే డిశ్చార్జ్ చేసినట్లు కోల్ కతా ఇనిస్టిట్యూట్ ఆఫ్ చైల్డ్ హెల్త్ కేర్ కు చెందిన డాక్టర్ పీపీ గిరి తెలిపారు.