కారుపైకి దూసుకెళ్లిన మరో కారు.. 8మంది మృతి

కారుపైకి దూసుకెళ్లిన మరో కారు.. 8మంది మృతి

హర్యాన బహదూర్ ఘర్ బద్లి సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. KMP ఎక్స్ ప్రెస్ వే పై  వేగంగా వచ్చిన కారు మరో కారుపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో 8 మంది అక్కడికక్కడే చనిపోయారు. మృతుల్లో ముగ్గురు మహిళలు, ఒక చిన్నారి ఉన్నారు. ప్రమాదానికి కారకుడైన డ్రైవర్ కారును అక్కడే వదిలేసి పరిపోయినట్లు తెలుస్తోంది. మృతులు యూపీలోని ఫిరోజాబాద్ కు చెందింది గుర్తించారు. ప్రమాద సమయంలో కారులో 11 మంది ఉన్నారు. గాయపడిన వారిని చికిత్స కోసం సమీప హాస్పిటల్ కు తరలించారు.