50 జిల్లా ల్లోనే 80 శాతం కేసులు

50 జిల్లా ల్లోనే 80 శాతం కేసులు

న్యూఢిల్లీ: దేశంలోని 740 జిల్లాల్లో 50 జిల్లాల్లో నే 80 శాతం కేసులున్నాయని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హ‌ర్ష‌వ‌ర్ధ‌న్ చెప్పారు. కేసులు ఎక్కువగా ఉన్న ప్రాంతాల నుంచి వేరే ప్రాంతాల పై ప్రభావం పడకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. అందుకోసం మూడంచెల ఫార్ములా అమలు చేస్తున్నామన్నారు. కేసులను తొందరగా గుర్తించడం, టెక్నాలజీతో కాంటాక్ట్ ట్రేసింగ్ ను మరింత పటిష్టం చేయడం, దానికి ప్రజల సహకారం తీసుకోవడం వంటి చర్యలను తీసుకుంటున్నట్టు ఆయన చెప్పారు. శుక్ర వారం జరిగిన 19వ గ్రూప్ఆఫ్ మినిస్టర్స్ (జీవోఎం) మీటింగ్ లో ఆయన మాట్లాడారు. కేసులు ఎక్కువగా ఉన్న సిటీలు, జిల్లాలపై ప్రత్యేక దృష్టిపెడతామన్నారు. హైదరాబాద్ , పుణే, ఠాణే, బెం గళూరు వంటి సిటీలపై ఫోకస్ ఎక్కువగా ఉంటుందని చెప్పారు. దేశంలో కరోనాతీవ్రత తక్కువేనని హ‌ర్ష‌వ‌ర్ద‌న్ అన్నారు. ప్రస్తుతం దేశంలో వెంటిలేటర్లమీద ట్రీట్మెంట్ తీసుకుంటున్న పేషెంట్లు 0.28 శా తం మాత్రమేనన్నారు. కరోనా ఎఫెక్ట్ తో దేశంలో మెడిక‌ల్ ఉత్పత్తులు పెరిగాయ‌ని హ‌ర్ష‌వ‌ర్ద‌న్ చెప్పారు.