ట్రీట్మెంట్ లేకుండానే 80 శాతం మంది పేషెంట్స్ క్యూర్ అవుతారు- ‌‌డబ్ల్యూహెచ్ఒ

ట్రీట్మెంట్ లేకుండానే 80 శాతం మంది పేషెంట్స్ క్యూర్ అవుతారు- ‌‌డబ్ల్యూహెచ్ఒ

జెనీవా : కరోనా ప్రపంచాన్ని కుదిపేస్తోంది. లక్షలాది మంది దీని బారిన పడి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొత్త వైరస్ కు మందులేక ఎట్లా ట్రీట్మెంట్ చేయాలో తెలియక డాక్టర్లు పరేషాన్ అవుతున్నారు. కానీ కరోనా సోకిన వారిలో 80 శాతం మంది ట్రీట్మెంట్ లేకుండానే క్యూర్ అవుతారంట. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ (డబ్యూహెచ్ఒ) నే ఈ విషయాన్ని ప్రకటించింది. కరోనా పేషెంట్లలో తీవ్రత ఎక్కువ వారికి మినహా మిగతా వారంతా ఏ ట్రీట్మెంట్ లేకుండానే కోలుకుంటారని తెలిపింది. కరోనా ప్రభావం ప్రారంభమైన నాటికి నుంచి డబ్ల్యూహెచ్ఒ ట్విట్టర్ ద్వారా దాదాపు 60 లక్షల మంది కరోనా పై అడిగిన ప్రశ్నలకు సమాధానాలిచ్చింది. వీటిలో ఎక్కువగా అడిగిన 14 ప్రశ్నలు సమాధానాలను ట్విట్టర్ ద్వారా వెల్లడించింది. కరోనా రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, కరోనా లక్షణాలను అందులో వివరించింది. ఏ వయసు వారికైనా కరోనా సోకుతుందని…వేడి వాతావారణంలో కరోనా వైరస్ బతకదన్నది నిజం కాదని స్పష్టం చేసింది. ఆస్తమా, డయాబెటిస్, హార్ట్ డిసీస్, ఉన్న వారికి రిస్క్ ఎక్కువగా ఉంటుందని తెలిపింది. మాస్క్ ఉన్న సోషల్ డిస్టెన్స్ కనీసం మీటర్ దూరం పాటించాలని కోరింది. వ్యాక్సిన్ ఎప్పుడూ వస్తుందన్న ప్రశ్నకు సమాధానమిస్తూ దీనికి పలు ప్రైవేట్ కంపెనీలతో కలిసి పనిచేస్తున్నామని వ్యాక్సిన్ వచ్చేందుకు మరింత సమయం పడుతుందని డబ్ల్యూహెచ్ఒ తెలిపింది.