జలపాతం చూసేందుకు వెళ్లి.. చిక్కుకున్న 82 మంది పర్యాటకులు

జలపాతం చూసేందుకు వెళ్లి.. చిక్కుకున్న 82 మంది పర్యాటకులు

ములుగు జిల్లా అడవుల్లో 82 మంది పర్యాటకులు చిక్కుకుపోయారు. వీరభద్రవరంలో 15 కార్లు,10 బైకులు  పార్కింగ్ చేసి  ముత్యం దార జలపాతం  సందర్శనకు వెళ్లారు  పర్యాటకులు. తిరిగి వస్తుండగా  వాగు ఒక్కసారిగా పొంగిపోవడంతో వాగు దాటలేక అడవిలోనే ఉండిపోయారు. 

ఈ ఘటనపై  మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు,  మంత్రి సత్యతి రాథోడ్ ఆరాదీశారు. జిల్లా   కలెక్టర్, ఎస్పీలకు ఫోన్ చేసి మాట్లాడారు. వెంటనే పర్యాటకులను రక్షించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మంత్రుల ఆదేశాలతో  కదిలిన అధికార యంత్రాంగం పర్యాటకులను రక్షించేందుకు రంగంలో దిగింది. ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది అడవిలో చిక్కు పర్యాటకులను రక్షించేందుకు ముమ్మరంగా రెస్క్యూ ఆపరేషన్ చేస్తోంది. పర్యాటకులకు ఫుడ్ ను అందిస్తోంది.