వానాకాలం సాగు..82.92 లక్షల ఎకరాలు

వానాకాలం సాగు..82.92 లక్షల ఎకరాలు
  • వానాకాలం సాగు..82.92 లక్షల ఎకరాలు
  • ప్రభుత్వానికి వ్యవసాయ శాఖ నివేదిక
  • ఇప్పటి వరకు 43.25 లక్షల ఎకరాల్లో పత్తి, 25.52 లక్షల ఎకరాల్లో వరి సాగు

హైదరాబాద్‌‌, వెలుగు:  రాష్ట్ర వ్యాప్తంగా వానాకాలం సీజన్​లో 82.92 లక్షల ఎకరాల్లో పంట సాగై నట్లు వ్యవసాయ శాఖ వెల్లడించింది. ఈమేరకు బుధవారం ప్రభుత్వానికి నివేదిక అందజేసింది. ఈ సీజన్‌‌ సాధారణ సాగు విస్తీర్ణం 1.24 కోట్ల ఎకరాలు కాగా, 66.72 శాతం విస్తీర్ణంలో పంటలు సాగ య్యాయి. వాస్త వంగా నిరుడు వానాకాలం సీజన్ ఇదే టైంలో కేవలం 73.65 లక్షల ఎకరాలే సాగ య్యాయి. ఇక పత్తి సాధారణ సాగు విస్తీర్ణం 50.59 లక్షల ఎకరాలు కాగా, ఇప్పటి వరకు 43.25 లక్షల ఎకరాల్లో పత్తి సాగైంది. వరి సాధా రణ సాగు విస్తీర్ణం 49.86 లక్షల ఎకరాలు కాగా, 25.52 లక్షల ఎక రాల్లో నాట్లు పడ్డాయి. గతేడాది ఇదే టైమ్​కు వరి నాట్లు 14.75 లక్షల ఎకరాల్లోనే పడ్డాయి. ఇక పప్పు ధాన్యాల సాధారణ సాగు విస్తీ ర్ణం 9.43 లక్షల ఎకరాలు కాగా, ఇప్పటివరకు 4.80 లక్షల ఎకరాల్లో సాగయ్యాయి. సోయాబీన్‌‌ సాధా రణ విస్తీర్ణం 4.13 లక్షల ఎకరాలు కాగా, 4.26 లక్షల ఎకరాల్లో సాగైంది. మొక్క జొన్న సాధారణ సాగు విస్తీర్ణం 7.13 లక్షల ఎకరాలు కాగా, ఇప్ప టివరకు 4.51 లక్షల ఎకరాల్లో సాగైంది.