
బారాబంకీ: ఉత్తర్ ప్రదేశ్‌లోని బారాబంకీ జిల్లాలో గురువారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ బస్సు, ట్రక్కు పరస్పరం ఢీకొన్న ఈ ఘటనలో 9 మంది మృతి చెందగా.. 27 మంది గాయాలపాలయ్యారు. యాక్సిడెంట్‌కు గురైన బస్సు.. ఢిల్లీ నుంచి లక్నో మీదుగా బహ్రాయిచ్‌కు వెళ్తోంది. ఈ ఘటన గురించి తెలియగానే పోలీసులు వెంటనే అక్కడికి చేరుకున్నారని.. రెస్క్యూ ఆపరేషన్ జరుగుతోందని బారాబంకీ డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ ఆదర్శ్ సింగ్ తెలిపారు. గాయపడిన వారికి జిల్లా ఆస్పత్రిలో ట్రీట్‌మెంట్ అందిస్తున్నామని చెప్పారు. తీవ్రంగా గాయపడిన వారిని లక్నోలోని కేజీఎంయూ సెంటర్‌లో చేర్చామన్నారు. కాగా, ఈ ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు రూ.2 లక్షలు, గాయపడిన వారి ఫ్యామిలీలకు రూ.50 వేల ఎక్స్‌గ్రేషియాను యోగి ఆదిత్యనాథ్ సర్కారు ప్రకటించింది.