మేనత్త ప్రేమ పెళ్లి చేసుకుందని .. కాల్చి చంపిన తొమ్మిదేళ్ల మేనళ్లుడు

మేనత్త ప్రేమ పెళ్లి చేసుకుందని ..  కాల్చి చంపిన తొమ్మిదేళ్ల మేనళ్లుడు

తన మేనత్త ప్రేమ పెళ్లి చేసుకోవడాన్ని జీర్ణించుకోలేకపోయిన 9ఏళ్ల బాలుడు ఆమెను తుపాకీతో కాల్చి చంపాడు.

గన్ కల్చర్ కు అడ్డాగా మారిన పాకిస్తాన్ లో ఈ తరహా దారుణాలు ఎక్కడోచోట జరుగుతూనే ఉన్నాయి. తాజాగా పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… పాకిస్తాన్ లోని లాహోర్ నుండి 200 కిలోమీటర్ల దూరంలో ఉన్న సర్గోధలోని చక్ 104-ఎస్బి గ్రామం ఉంది.

ఆ గ్రామంలో ఓ కుటుంబానికి చెందిన బాధితురాలి(30) 10 ఏళ్ల క్రితం కుటుంబ సభ్యుల్ని వ్యతిరేకించి ఓ వ్యక్తిని ప్రేమ వివాహం చేసుకుంది. అప్పటి నుంచి బాధితురాలికి ఆమె కుటుంబానికి సంబంధాలు చెడిపోయాయి.

అయితే గత కొద్ది కాలంగా కుటుంబసభ్యులు బాధితురాలితో అన్యోన్యంగా ఉంటున్నట్లు తెలుస్తోంది. తాజాగా ఇంట్లో జరిగే శుభకార్యానికి రావాలంటూ బాధితురాల్ని అన్న పిలుపునిచ్చాడు. అన్న కోరిక మేరకు బాధితురాలి పుట్టింటికి వచ్చింది.

శుభకార్యం జరుగుతుండగా బాధితురాలి 9ఏళ్ల మేనల్లుడు అమెపై రెండు రౌండ్ల కాల్పులకు తెగబడ్డాడు. ఈ కాల్పుల్లో బాధితురాలు అక్కడికక్కడే మరణించింది. అనంతరం కుటుంబ సభ్యులు ఆగ్రామం నుంచి పరారయ్యారు.

గ్రామస్థుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు