
న్యూఢిల్లీ: ఢిల్లీకి చెందిన 9 ఏళ్ల ఆరిత్ కపిల్.. ఆన్‌లైన్ ఫ్లాట్‌ఫామ్‌లో జరిగిన ఎర్లీ టైటిల్డ్ ట్యూస్‌డే చెస్ టోర్నీలో వరల్డ్ నంబర్‌వన్ మాగ్నస్ కార్ల్‌సన్ ఓడించినంత పనిచేశాడు. కానీ చివరకు డ్రాతో సరిపెట్టుకున్నాడు. అండర్–9 నేషనల్ చాంపియన్ అయిన ఆరిత్ బుధవారం జరిగిన మ్యాచ్‌లో కార్ల్‌సన్‌తో సమానంగా ఎత్తులు వేశాడు. ఓ దశలో మాగ్నస్‌ను కంప్లీట్‌గా నిస్సహాయ స్థితిలోకి నెట్టాడు. కానీ టైమ్ ముగిసిపోవడంతో చివరి రెండు ఎత్తులను సరిగ్గా వేయలేకపోయాడు. ఫలితంగా గేమ్ డ్రాగా ముగిసింది.
ఆరిత్ ఈ టోర్నీని జార్జియాలోని తన హోటల్ రూమ్ నుంచి ఆడాడు. ప్రస్తుతం అతను అండర్–10 వరల్డ్ చాంపియన్‌షిప్‌లో పాల్గొంటున్నాడు. తొలి రెండు రౌండ్లలో ఆరిత్ నెగ్గాడు. ఇండియాకే చెందిన వి. ప్రణయ్ 10 పాయింట్లతో ఎర్లీ టైటిల్డ్ ట్యూస్‌డే టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు. అమెరికన్ గ్రాండ్ మాస్టర్ హాన్స్ మోక్ నీమాన్, కార్ల్‌సన్ ఇద్దరు చెరో 9.5 పాయింట్లతో ముగించారు. ఈ ఇద్దరి మధ్య జరిగిన టైబ్రేక్‌లో నెగ్గిన నీమాన్ రెండో ప్లేస్‌లో నిలిచాడు.