మహా కుంభమేళాకు 91లక్షల మంది హాజరు

మహా కుంభమేళాకు 91లక్షల మంది హాజరు

హరిద్వార్ లో జరిగిన కుంభమేళాకు 91 లక్ష మంది హాజరైనట్లు ఈవెంట్  ఆర్గనైజర్స్ ప్రకటించారు. జనవరి 14 నుండి ఏప్రిల్ 27 వరకు 91 లక్షల మంది యాత్రికులు గంగాలో పవిత్ర స్నానాలు చేసినట్లు చెప్పారు. వీరిలో అధికంగా  60 లక్షల మంది ప్రజలు ఏప్రిల్‌లో వచ్చినట్లు చెప్పారు. ఏప్రిల్ 12 న 35 లక్షల మంది, మార్చి 11 న  మహా శివరాత్రి సందర్భంగా 32 లక్షల మంది యాత్రికులు వచ్చారని చెప్పారు.  చివరి 'షాహి స్నాన్' (రాయల్ బాత్) కు 25 వేల మంది భక్తులు  వచ్చారు.  కుంభమేళా ముగిసిన తరువాత బుధవారం నుండి హరిద్వార్లో కర్ఫ్యూను ఆదేశించారు.