95% స్కూళ్లలో గర్ల్స్‌ టాయిలెట్లు 

95% స్కూళ్లలో గర్ల్స్‌ టాయిలెట్లు 
  • నీతి ఆయోగ్‌ ఎస్‌ ఈక్యూఐలో వెల్లడి

దేశంలో 32 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోనిస్కూళ్లలో 95 శాతం గర్ల్స్‌‌‌‌ టాయిలెట్లు ఉన్నాయని వెల్లడైంది. కేంద్ర పాలిత ప్రాంతాల్లో 100 శాతం,పెద్ద రాష్ట్రాల్లో 97.6 శాతం, చిన్న రాష్ట్రాల్లో 96.7శాతం ఉన్నట్లు తెలిసిం ది. నీతి ఆయోగ్‌‌‌‌ డెవలప్‌‌‌‌ చేసినస్కూల్‌ ఎడ్యుకే షన్‌ క్వాలిటీ ఇండెక్స్‌ ఈ విషయం వెల్లడించిం ది. 2016=17కు గాను ఈ సూచీ విడుదలైంది. ఇందులో 83.4 శాతంతో అస్సాం చివరన ఉంది.ఆ తర్వాతి స్థానంలో మేఘాలయ (84.1) నిలిచింది. హిమాచల్‌ ప్రదేశ్‌‌‌‌ 2016=17లో 100 శాతం టార్గెట్‌ ను చేరుకుంది. గుజరాత్‌ గతేడాది సాధించింది.తమిళనాడు (99.9), పంజాబ్‌ (99.8)లలో మాత్రం అంతకు ముందు ఏడాది ఉన్న స్థాయిలోనే ఉన్నాయి. కంప్యూటర్‌ ఆధారిత విద్య (సీఏఎల్‌ )లో మాత్రంఅనుకున్నంత ముందుకు పోవడం లేదని సూచీ వెల్లడించింది.

ఎలిమెంటరీ స్థాయి విద్యలో నాలుగు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలే 50 శాతం కన్నాఎక్కువ సీఏఎల్‌ సాధించాయని పేర్కొంది. ఇందులో చండీగఢ్‌ 76.7 శాతంతో ముందుందని, లక్షద్వీప్‌‌‌‌ 75.6 శాతంతో రెండో స్థానంలో ఉందని చెప్పింది.బీహార్‌ , త్రిపుర, జార్ఖండ్‌ , మేఘాలయ, జమ్మూకాశ్మీర్‌ , చత్తీస్‌ గఢ్‌ , ఆంధ్రప్రదేశ్‌‌‌‌, మధ్యప్రదేశ్‌‌‌‌లలో సీఏఎల్‌5 శాతం కన్నా తక్కువుం దంది. ఇక కంప్యూటర్‌ లేబొరేటరీలు పది రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని సెకండరీ స్కూళ్లలో 50 శాతం కన్నా ఎక్కువున్నాయని లెక్కలు చెబుతున్నాయి. లక్షద్వీప్‌‌‌‌ 84.6 శాతంకవరేజీతో ముందుంది. దాద్రానగర్‌ హవేలీ (81శాతం) తర్వాతి స్థానంలో ఉంది. ఒకేషనల్‌ విద్యకు కూడా పెద్దగా ప్రాధాన్యం ఇవ్వట్లేదని సూచీ చెప్పింది.2016,17లో ఆరు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోనే 10 శాతం కన్నా ఎక్కువ స్కూళ్లలో ఒకేషనల్‌ విద్య అందుబాటులో ఉందని తేలింది.