ఆరు వారాల్లోనే 9.8 లక్షల ఇన్సూరెన్స్ క్లెయిమ్స్!

ఆరు వారాల్లోనే 9.8 లక్షల ఇన్సూరెన్స్ క్లెయిమ్స్!
  • ఇన్సూరెన్స్​ కంపెనీలకు 6 వారాల్లోనే 9.8 లక్షల క్లెయిమ్స్!
  • వీటికి చెల్లించాల్సిన మొత్తం రూ. 14,560 కోట్లు
  • గత 44 రోజుల్లో రూ. 8,385 కోట్ల కోవిడ్ క్లెయిమ్స్

న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి ఇన్సూరెన్స్ కంపెనీల నడ్డివిరుస్తోంది. క్లెయిమ్‌‌‌‌‌‌‌‌‌‌లు విపరీతంగా వస్తుండడంతో  ఫైనాన్షియల్‌‌‌‌గా ఇన్సూరెన్స్​ కంపెనీలు బలహీనంగా మారుతున్నాయి.  గత ఆర్థిక సంవత్సరం మొదటి ఆరు నెలల్లో వచ్చిన క్లెయిమ్స్‌‌‌‌లో  57 శాతం క్లెయిమ్స్ ఈ ఏడాది తొలి ఆరు వారాల్లోనే వచ్చాయి. నాన్–లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీలన్నింటిలోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది.  ఈ ఏడాది మార్చి 31 నాటికి, ఆరోగ్య బీమా సంస్థలతో సహా నాన్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీలకు కరోనా ట్రీట్‌‌‌‌మెంట్‌‌‌‌ ఖర్చుల కోసం రూ.14,560 కోట్ల విలువైన రీయింబర్స్‌‌‌‌మెంట్లు కోరుతూ 9.8 లక్షల క్లెయిమ్‌‌‌‌లు వచ్చాయి. ఈ నెల 14 నాటికి రూ .22,955 కోట్ల విలువైన 14.8 లక్షల క్లెయిమ్స్ అందాయి.  అంటే ఆర్థిక సంవత్సరంలో మొదటి 44 రోజుల్లో వచ్చిన కోవిడ్ క్లెయిమ్‌‌‌‌ల విలువ రూ .8,385 కోట్లు.  న్యూ ఇండియా అస్యూరెన్స్  ఛైర్మన్ అతుల్ సహాయ్ మాట్లాడుతూ తమ సంస్థ చెల్లించిన క్లెయిమ్స్ విలువ రూ .2,200 కోట్ల వరకు ఉందని చెప్పారు. "గత సంవత్సరం కూడా మాకు భారీగా క్లెయిమ్స్ ఉన్నప్పటికీ, బ్యాలెన్స్‌‌‌‌షీట్‌‌‌‌పై ఎఫెక్ట్ గురించి ఆందోళన చెందలేదు. ఈ సంవత్సరం మాత్రం క్లెయిమ్స్ కచ్చితంగా ఆందోళనకరస్థాయికి చేరుకుంటాయి" అని ఆయన అభిప్రాయపడ్డారు. పెరుగుతున్న కేసులు కరోనా కవచ్ పాలసీలపై నష్టాలను కలిగిస్తున్నప్పటికీ, ప్రభుత్వ రంగ బీమా సంస్థలు ధరల పెంపు గురించి చూడటం లేదని ఆయన అన్నారు.

ప్రీమియం రేట్లను పెంచినా..
గత ఏడాది చాలా ఇన్సూరెన్స్ కంపెనీలు ప్రీమియం రేట్లను పెంచాయి. మొదటి ఆరు నెలల్లో లాక్‌డౌన్‌‌‌‌ కారణంగా క్లెయిమ్స్ తక్కువగానే వచ్చాయి. ఎక్కువ మంది గవర్నమెంటు ఆస్పత్రుల్లో ట్రీట్‌‌‌‌మెంట్ చేయించుకున్నారు. బజాజ్ ఎలియాంజ్ జనరల్ ఇన్సూరెన్స్‌‌‌‌కు చెందిన భాస్కర్ నేరూర్కర్ మాట్లాడుతూ ‘‘గత ఏడాది చాలా మంది ఆస్పత్రుల్లో తొమ్మిది రోజులు వరకు ట్రీట్‌‌‌‌మెంట్ తీసుకునేవాళ్లు. ఈసారి ఆరు రోజులకు తగ్గించారు. ట్రీట్‌‌‌‌మెంట్​ పద్ధతులు మారడమే ఇందుకు కారణం. బెడ్స్ కొరత తీవ్రంగా ఉండటం వల్ల కూడా త్వరగా డిశ్చార్జ్ చేసి, హోం ఐసోలేషన్‌‌‌‌లో ఉండాలని చెబుతున్నారు”అని ఆయన వివరించారు. ఈసారి టైర్ 2,3 పట్టణాల నుంచి క్లెయిమ్స్ పెరిగాయని అన్నారు. ప్రభుత్వ ఆస్పత్రులు తక్కువగా ఉండటంతో, చాలా మంది ఇన్సూరెన్స్‌‌‌‌తోనే ట్రీట్​మెంట్​ చేయించుకుంటున్నారని భాస్కర్ వివరించారు. ఈ ఆర్థిక సంవత్సరంలో తొలి ఆరు వారాల్లో వచ్చిన కేసుల్లో 8.5 లక్షల  (86 శాతం) క్లెయిమ్స్​ను పరిష్కరించారు. ఇప్పటికీ ఇంకా 1.37 లక్షల కేసులు పెండింగులో ఉన్నాయి.