ఆధ్యాత్మికం: పిల్లలకు ఇంగ్లీషు అక్షరాలను ఇలా చెప్పండి..

ఆధ్యాత్మికం: పిల్లలకు ఇంగ్లీషు అక్షరాలను ఇలా చెప్పండి..

ప్రస్తుతం స్కూళ్లలో తెలుగు మాట్లాడటం తప్పుగా భావిస్తున్నారు.  అంతా ఆంగ్లమయం... ఇక హిందువుల దేవుళ్లు.. పేర్లను మర్చిపోతున్నారు.  ఇంగ్లీషు అక్షరాలను చెప్పేటప్పుడు శ్రీరామ నామావళితో చెపితే.. హిందూ ధర్మానికి న్యాయం చేసినవారవుతారు

 హైటెక్ యుగంలో స్కూళ్లలో పిల్లలకు పాఠాలకు చెప్పేటప్పుడు  A ఫర్ యాపిల్..B ఫర్ బ్యాట్ .. C ఫర్ క్యాట్ అని ఇలా అక్షరాలు నేర్పుతూ పాఠాలు చెబుతున్నారు.ఇదంతా విదేశీ సంస్కృతి.. ప్రస్తుత జనరేషన్​ లో ఇంగ్లీషు అవసరమే కాని.. తెలుగుభాషను పూర్తిగా విస్మరించమని ఎక్కడా లేదు.. ఎవరూ చెప్పలేదు.  కాని ఇప్పుడు.. గల్లీలోని  బళ్లో కూడా.. ఇవే నేర్పుతున్నారు. కాని ఇంగ్లీషుతో పాటు మన తెలుగు సంస్కృతి కూడా నేర్పాల్సిన అవసరం ఉంది. .  పిల్లలకు ఇలా చెబితే శ్రీరాముడి అవతారాలు... ఆయన నామాలు పిల్లలకు తెలిసే అవకాశం ఉంది

  • A - అయోధ్య రామ
  • B - భార్గవ రామ
  • C - చిన్మయ రామ
  • D- దశరథ రామ
  • E - ఈశ్వర రామ
  • F - ఫల్గుణ రామ
  • G - గుణాత్మక రామ
  • H - హనుమత రామ
  • I -  ఇనయ రామ
  • J - జగదభి రామ
  • K - కౌసల్య రామ
  • L - లక్ష్మణ రామ
  • M - మర్యాద రామ
  • N - నరహరి రామ
  • O -  ఓంకార రామ
  • P - పురుషోత్తమ రామ
  • Q - కుశలవ రామ
  • R - రఘుకుల రామ
  • S - సీతా రామ
  • T - తారక రామ
  • U - ఉదాత్త రామ
  • V - వశిష్ఠ రామ
  • W - వైకుంఠ రామ
  • X - జితేంద్ర రామ
  • Y - యోగిత రామ
  • Z - జనహిత రామ