భారత్ తో మ్యాచ్.. టాస్ గెలిచిన శ్రీలంక

భారత్ తో మ్యాచ్.. టాస్ గెలిచిన శ్రీలంక

ఆసియాకప్ లో భాగంగా ఇవాళ టీమిండియాతో జరుగుతున్న మ్యాచ్ లో శ్రీలంక టాస్ గెలిచింది. కెప్టెన్ దసున్ షనక ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. ఫైనల్ రేసులో నిలవాలంటే రోహిత్ సేన ఈ మ్యాచ్ లో తప్పనిసరిగా గెలవాలి. ఆసియాకప్‌‌‌‌లో టైటిల్‌‌‌‌ఫేవరెట్‌‌‌‌గా బరిలోకి దిగిన టీమిండియా.. ఒక్క ఓటమితో  ఫైనల్‌‌‌‌ రేసులో నిలవాలంటే చావో రేవో లాంటి పరిస్థితిని తెచ్చుకుంది.  పాకిస్తాన్‌‌‌‌తో సూపర్‌‌‌‌– 4 తొలి మ్యాచ్‌‌‌‌లో చేతుల్లోకి వచ్చిన విజయాన్ని వదులుకున్న భారత్.. ఈ పోరులో శ్రీలంకతో పోటీ పడుతోంది. ఫైనల్‌‌‌‌ రేసులో నిలవాలంటే ఈ మ్యాచ్‌‌‌‌లో కచ్చితంగా గెలవాల్సిన నేపథ్యంలో భారత జట్టుపై తీవ్ర ఒత్తిడి ఉంది. రోహిత్‌‌‌‌సేన ముందుకెళ్లాలంటే బౌలర్లు తక్షణమే పుంజుకోవాల్సి ఉంటుంది. అదే సమయంలో ఈ పోరులో ఎక్కువ  ప్రయోగాలు చేయకుండా ఉంటే మంచిది. గాయపడ్డ రవీంద్ర జడేజా, హర్షల్‌‌‌‌ పటలే, జస్‌‌‌‌ప్రీత్‌‌‌‌ బుమ్రా లేకపోవడంతో ఇండియా బౌలింగ్‌‌‌‌ బలహీనమైంది. ఆప్షన్స్‌‌‌‌ కూడా  తగ్గిపోయాయి. 

భారీ ఓటమితో టోర్నీని ఆరంభించిన శ్రీలంక వరుసగా రెండు విజయాలతో జోరు మీదుంది. బంగ్లాదేశ్‌‌‌‌, అఫ్గానిస్తాన్‌‌‌‌పై ఒత్తిడిని జయించి టార్గెట్లను ఛేజ్‌‌‌‌ చేయడం ఆ జట్టు క్రికెటర్లలో కాన్ఫిడెన్స్‌‌‌‌ నింపింది. మూడో నంబర్‌‌‌‌లో ఆడుతున్న చరిత్‌‌‌‌ అసలంక తప్పితే మిగతా బ్యాటర్లంతా ఆకట్టుకుంటున్నారు. జట్టు విజయాల కోసం తలో చేయి వేస్తూ సమష్టిగా ముందుకెళ్తున్నారు. బంగ్లాపై  కెప్టెన్‌‌‌‌ షనక, కుశాల్‌‌‌‌ మెండిస్‌‌‌‌ జట్టును గెలిపిస్తే.. దనుష్క గుణతిలక, భానుక రాజపక్స గత పోరులో అఫ్గాన్‌‌‌‌ పని పట్టారు. దాంతో,  ఏ పరిస్థితుల్లో అయినా విజయం సాధించగలమనే నమ్మకం లంక ఆటగాళ్లలో పెరిగింది. లంకతో పోలిస్తే  ఇండియా అన్నింటా బలంగానే ఉంది. కానీ, షార్ట్‌‌‌‌ ఫార్మాట్‌‌‌‌లో చిన్న తప్పిదం చేసినా పెద్ద మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. అందుకు ఆదివారం రాత్రి పాక్‌‌‌‌ చేతిలో ఎదురైన ఓటమే ఉదాహరణ. మరి, రోహిత్‌‌‌‌సేన లంకను ఓడించి టైటిల్‌‌‌‌ రేసులో నిలుస్తుందో లేదో  వేచిచూడాలి.