కరోనాను జయించిన 102 ఏళ్ల వృద్ధురాలు

కరోనాను జయించిన 102 ఏళ్ల వృద్ధురాలు

హాస్పిటల్ నుంచి ఆదివారం డిశ్చార్జైన వెరా బీలీ

షెఫీల్డ్: ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనాను 102 ఏండ్ల వృద్ధురాలు జయించింది. వారం రోజులపాటు వైరస్ తో పోరాడి హాస్పిటల్ నుంచి
ఆదివారం డిశ్చార్జ్ అయ్యింది. బ్రిటన్ లో వైరస్ సోకి కోలుకున్న అతిపెద్ద వయస్కురాలు వెరా బీలీ కావడం విశేషం. హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్
అవుతున్న బీలీకి డాక్టర్లు, నర్సులు అభినందనలు తెలిపారు. తీవ్రమైన దగ్గుతో బాధపడుతూ వెరాబీలీ నార్తరన్ జనరల్ హాస్పిటల్లో సోమవారం అడ్మిట్ అయ్యింది. ఆమెకు ఇద్దరు పిల్లలు, నలుగురు మనవలు, ఏడుగురు ముని మనవలుఉన్నారు. ‘మా అమ్మ చాలా ధైర్యవంతురాలు, మనోనిబ్బరం ఎక్కువ, వైరస్‌‌ నుంచి ఆమె కోలుకున్నందుకు సంతోషంగా ఉందని’ వెరా కూతురు ఇరెనె వైట్‌‌హెడ్ చెప్పారు. బీలీ కోలుకుందని తెలిసి ఆశ్చర్యపోయానని ట్రస్ట్ చీఫ్ నర్స్ క్రిస్మోర్లె అన్నారు. ఆమె కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. వైరస్ మహమ్మారి విజృంభిస్తున్న
సమయంలో పేషెంట్లకు అద్భుతంగా ట్రీట్‌‌మెంట్ చేస్తున్న మా టీమ్స్ కి ధన్యవాదాలు అని చెప్పారు.

For More News..

రాష్ట్రంలో 800 దాటిన కరోనా కేసులు

దేశంలో 17 వేలు దాటిన కేసులు

3 లింకులు,29 కేసులు.. క్వారంటైన్లోకి టీఆర్ఎస్ ముఖ్యనేతలు