
నలభై ఏళ్ల క్రితం.. అంటే 1985 లో అప్పటి ప్రధాని రాజీవ్ గాంధీ చేసిందే.. ఇప్పుడు 2025 లో రాహుల్ గాంధీ చేయడం చర్చనీయాంశంగా మారింది. బీహార్ లో ఓటర్ అధికార్ యాత్ర నిర్వహిస్తున్న రాహుల్.. నలభై ఏళ్ల కింద తండ్రి రాజీవ్ గాంధీ దర్శించిన స్థలాన్ని విజిట్ చేయడం.. ఆయన కూర్చున్న ప్లేస్ లోనే కూర్చోవడంపై రాజీవ్ గాంధీని గుర్తు చేశారని నెటిజన్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
బీహార్ లో ఓట్ల తొలగింపుపై ఓటర్ అధికార్ యాత్ర నిర్వహిస్తున్న రాహుల్.. ఖన్ ఖాహ్ రెహమానీ మసీదును సందర్శించారు. అప్పట్లో రాజీవ్ గాంధీ కూర్చున్న స్థలంలోనే.. నేలపై కోర్చోవడం.. రెండు విభిన్న శకాలకు సంబంధించిన రాజకీయ ముఖచిత్రాన్ని ప్రతిబింభిస్తోందని సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది.
జమల్పూర్ లో ఉన్న ఖన్ ఖాహ్ రెహమానీ మసీదును మౌలానా మహమ్మద్ అలీ ముంగ్రీ 1901లో స్థాపించారు. ఈ మసీదు సామాజిక సంస్కరణలతో పాటు స్వాతంత్ర్య పోరాటంలో కీలక పాత్ర వహించింది.
యాత్రలో భాగంగా ఆరవ వరోజు దారిలో మాస్క్ ను దర్శించిన రాహుల్.. అక్కడి మౌలానాతో భేటీ అయ్యారు. ఆర్జేడీ నేత తేజశ్వీ యాదవ్ తో కలిసి మాస్క్ లో కాసేపు కూర్చుని చర్చలు జరిపారు.
►ALSO READ | ఆధార్ కార్డు ప్రభుత్వం జారీ చేసిందే కదా.. ఎన్నికల సంఘం అంగీకరించాల్సిందే: సుప్రీం కోర్టు
ఖన్ ఖాస్ రెహమానీ మాస్క్ తో గాంధీ కుటుంబానికి కొన్ని దశాబ్దాల అనుబంధం ఉంది. 1985 లో రాజీవ్ గాంధీ ఈ మసీదును దర్శించి అక్కడి మౌలానాతో భేటీ అయ్యారు. మళ్లీ 40 ఏళ్ల తర్వాత తండ్రి ఎక్కడైతే కూర్చున్నాడో అదే ప్లేస్ లో రాహుల్ కూర్చోవడం నెటిజన్లను ఆకర్శించింది.
ఖన్ ఖాహ్ మసీదు ముస్లిం కమ్యూనిటీకి ఎంతో పవిత్రమైన మాస్క్. ఇక్కడికి ఎంతో మంది వీఐపీలు వచ్చి పోతుంటారు. గతంలో మహాత్మా గాంధీ, జవహర్ లాల్ నెహ్రూ గతంలో ఈ మసీదును సందర్శించారు. స్వాతంత్ర్య పోరులో మొబిలైజేషన్ లో కీలక పాత్ర పోషిందని చెబుతారు. 1927 లో విద్యా విభాగం ఏర్పాటు చేసి ట్రస్ట్ ద్వారా ఎంతో మందిని చదివించారు. ప్రస్తుతం ఉన్న పోటీకి తగినట్లుగా JEE, NEET తదితర కోచింగ్ తో పాటు.. స్మార్ట్ క్లాసెస్ నిర్వహిస్తూ విద్యావ్యాప్తి చేస్తున్నారు.