పాత డబుల్ డెక్కర్ బస్సు.. లగ్జరీ ఇల్లయింది

పాత డబుల్ డెక్కర్ బస్సు.. లగ్జరీ ఇల్లయింది

లండన్ సిటీలో ఇల్లు కట్టాలంటే చేతిలో కోట్ల రూపాయలుంటే కానీ సాధ్యం కాదు. అంత ఖర్చెందుకని అనుకునేవాళ్ల కోసం తక్కువ ఖర్చులోనే  ఓ లగ్జరీ ఇంటిని రెడీ చేసింది వేల్స్​కు చెందిన హేలీ రోసన్ అనే 31 ఏండ్ల మహిళ. అందుకు రూ.3 లక్షలు పెట్టి ఓ పాత డబుల్ డెక్కర్ బస్సును ఎంచుకుంది. దానిలోని సీట్లన్నీ తీసేసి అందంగా ముస్తాబు చేసింది. ఆ బస్సులోనే స్టోరేజీతో కూడిన కింగ్ సైజ్ బెడ్రూమ్, మోడ్రన్ కిచెన్ , బాత్ టబ్​తో సహా వాష్ రూమ్, డ్రెస్సింగ్ రూమ్ ఏర్పాటు చేసింది. ఆఫీస్ రూమ్, గెస్ట్ ల కోసం గ్రౌండ్-ఫ్లోర్ లివింగ్ స్పేస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కూడా ఉండేలా జాగ్రత్త పడింది. ఫ్యాన్లు, సోఫాలు, బస్సు రూఫ్​టాప్​కు సోలార్ ప్యానెళ్ల ద్వారా కరెంటు ఫెసిలిటీ ఇలా ఒక్కటేమిటి..  లగ్జరీ డబుల్ బెడ్రూం ఫ్లాట్​కు ఏమాత్రం తీసిపోకుండా బస్సును లివింగ్ హౌస్​గా తయారు చేసింది. పోయినేడులో కొన్న ఆ పాత బస్సును ఇలా మార్చేందుకు తనకు రూ.16 లక్షలు ఖర్చవగా.. 18 నెలల సమయం పట్టిందని చెప్తోంది రోసన్. ప్రస్తుతం దీనిని లక్కీ డ్రా కంపెనీకి అప్పగించానని, 15 పౌండ్లకే అంటే 1400 రూపాయలకే టికెట్ కొని అదృష్టవంతులు డబుల్ డెక్కర్ ఇంటిని దక్కించుకోవచ్చిని చెప్తోంది.