ఓయూలో బహుజన బతుకమ్మ కార్యక్రమం 

ఓయూలో బహుజన బతుకమ్మ కార్యక్రమం 

హైదరాబాద్ : ఉస్మానియా యూనివర్సిటీలో ఒకరోజు ముందే బతుకమ్మ సెలబ్రేషన్స్ మొదలయ్యాయి. ఓయూలో అరుణోదయ సంస్కృతి సమాఖ్య ఆధ్వర్యంలో నిర్వహించిన బహుజన బతుకమ్మ సంబరాలు అంబరాన్నంటాయి. అరుణోదయ సంస్కృతి సమాఖ్య అధ్యక్షురాలు విమలక్క.. గత 13 ఏళ్లుగా ‘బహుజన బతుకమ్మ ’పేరుతో వేడుకలు నిర్వహిస్తున్నారు. కుల నిర్మూలన స్ఫూర్తితో బహుజన బతుకమ్మ సంబరాలను చేపడుతున్నారు. ప్రతి ఏడాది ఒక్కో అంశంతో బహుజన బతుకమ్మ కార్యక్రమాన్ని విమలక్క నిర్వహిస్తున్నారు. ఈసారి మాత్రం ‘కుల నిర్మూలన’ నినాదంతో బహుజన బతుకమ్మ వేడుకలు నిర్వహిస్తున్నారు. 

‘బహుజన బతుకమ్మ’ ఉత్సవం కాదు..ఒక ఉద్యమం అన్నారు విమలక్క. కుల దురహంకార హత్యలను ఖండించాలంటూ పిలుపునిచ్చారు. కులం కన్నా గుణం గొప్పది. మతం కన్నా మానవత్వం గొప్పది అన్నారామె. కుల దురహంకార హత్యలకు పాల్పడే వారిని ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ద్వారా వెంటనే శిక్షించాలంటున్నారు. ఓయూలో నిర్వహించిన బహుజన బతుకమ్మ కార్యక్రమంలో సావిత్రిబాయి ఫూలే ముని మనవరాలు నీతా తాయ్ పూలె కూడా బతుకమ్మ ఆడి పాడారు.