వన్డేల్లో ట్రిపుల్ సెంచరీ

వన్డేల్లో ట్రిపుల్ సెంచరీ


టీ20 క్రికెట్ వచ్చిన తర్వాత బ్యాట్సమన్ పరుగులు వాటర్ తాగినంత ఈజీగా సాధించేస్తున్నారు. ఒకప్పుడు సెంచరీ చేయాలంటే చెమటలు పట్టేవి. ధనాధన్ క్రికెట్ పుణ్యమాని..సెంచరీలు చెమట పట్టకుండా కొట్టేస్తున్నారు. ఇక ఇవాళ రేపట్ల వన్డేల్లో డబుల్ సెంచరీలు చేయడం సాధారణమైపోయింది. అయితే వేల పరుగులు, ఈజీగా డబుల్ సెంచరీలు సాధిస్తున్నా... వన్డేల్లో ట్రిపుల్ సెంచరీ మాత్రం ఇప్పటి వరకు నమోదు కాలేదు. కానీ మొట్టమొదటి సారిగా .. వన్డేల్లో ఓ బ్యాట్సమన్ ట్రిపుల్ సెంచరీ సాధించాడు. 

కామన్‌వెల్త్‌ బ్యాంక్‌ అంధుల సిరీస్‌లో భాగంగా బ్రిస్బేన్‌ వేదికగా కివీస్‌తో ఆసీస్ తొలి వన్డే ఆడింది. ఈ మ్యాచ్లో  ఆస్ట్రేలియా అంధ క్రికెటర్ స్టెఫన్ నీరో..  కేవలం 140 బంతుల్లోనే 309 రన్స్ చేశాడు.  దీంతో  1998లో అంధుల క్రికెట్ ప్రపంచకప్ లో పాక్  అంధ క్రికెటర్ మసూద్ జాన్ నెలకొల్పిన అత్యధిక పరుగుల (262) రికార్డును స్టెఫన్ నీరో  బద్దలుకొట్టాడు. 3 గంటల పాటు బ్యాటింగ్ చేసిన నీరు..49 బౌండరీలు, ఒక సిక్సర్ తో ట్రిపుల్ సెంచరీ కొట్టాడు. 

 నీరో ట్రిపుల్ సెంచరీ చేయడంతో ఆసీస్ 40 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 542 పరుగుల చేసింది. లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో న్యూజీలాండ్ 272  పరుగులకే  ఆలౌట్ అయింది. దీంతో ఆసీస్ 270 పరుగుల భారీ తేడాతో ఆసీస్ విజయం సాధించింది. బ్యాటింగ్ లో ట్రిపుల్ సెంచరీతో చెలరేగిన నీరో..వికెట్ కీపింగ్ చేసి   రనౌట్లు చేసి ఐదుగురిని పెవీలియన్ చేర్చాడు.