ట్రాఫిక్ లో చిక్కుకున్న IAS.. సామాన్యుడి సాయం.. ఇంట్లో సత్కారం

ట్రాఫిక్ లో చిక్కుకున్న IAS.. సామాన్యుడి సాయం.. ఇంట్లో సత్కారం

అతను ఐఏఎస్ అధికారి.. మొన్నటి వరకు మాజీ సీఎం జగన్ పేషీలో పని చేశారు.. ఏపీ రాష్ట్రంలో మోస్ట్ సీనియర్ అధికారి.. 2024 జూన్ 12వ తేదీ ఉదయం విజయవాడ ఎయిర్ పోర్టులో దిగారు.. తన కారులో.. సెక్యూరిటీ సిబ్బందితో కలిసి బెజవాడలోని ఇంటికి బయలుదేరారు. ఈ క్రమంలోనే ట్రాఫిక్ లో చిక్కుకుపోయారు.. ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు ప్రమాణ స్వీకారం కావటంతో.. ట్రాఫిక్ జాం అయ్యింది. తన కారులోనే గంటపాటు వెయిట్ చేశారు.. ఎటూ కదిలే పరిస్థితి లేదు.. 

సరిగ్గా ఈ సమయంలోనే ఓ బైకర్.. ఓ సామాన్యుడు.. తన బైక్ పై అటు వెళ్లారు. ఐఏఎస్ ప్రవీణ్ ప్రకాష్ ను గుర్తు పట్టారు.. సార్ కష్టంలో ఉన్నారని గుర్తించారు.. లిఫ్ట్ ఇస్తాను సార్ అన్నాడు.  అంతే ఆ కుర్రోడి బైక్ పై.. ఎయిర్ పోర్టు నుంచి 25 కిలోమీటర్లు ప్రయాణించిన తన ఇంటికి చేరుకున్నారు ఆ ఐఏఎస్ అధికారి ప్రవీణ్ ప్రకాష్.. 

మాములుగా అయితే సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ కావటంతో.. సెక్యూరిటీ సిబ్బంది ఉంటుంది.. దర్జాగా ట్రాఫిక్ ఆపి మరీ వెళతారు.. ఇవాళ మాత్రం స్వయంగా ట్రాఫిక్ కష్టాలు అనుభవించారు. ఓ కుర్రోడి సాయంతో 25 కిలోమీటర్లు బైక్ పై జర్ని చేసి ఇంటికి చేరారు. తనకు సాయం చేసిన కుర్రోడికి ఆ వెంటనే రుణం తీర్చుకున్నారు ఐఏఎస్ అధికారి ప్రవీణ్ ప్రకాష్.. ఇంట్లోనే చిరు సత్కారం చేశారు. 

కష్టంలో ఉన్నప్పుడు సాయం చేసినోళ్లను మర్చిపోకూడదు.. ఆపదలో ఉన్నప్పుడు సాయం చేసే గుణం ఈ తరం కుర్రోళ్లలో కూడా ఉందని.. సమయానికి సాయం చేసిన కుర్రోడికి కృతజ్ణతగా సత్కారం చేశారు ఐఏఎస్ అధికారి ప్రవీణ్ ప్రకాష్..  ఈ ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.. హ్యాట్సాప్ కుర్రోడా అని కొందరు అంటే.. హ్యాట్సాఫ్ సార్.. సాయం చేసినోళ్లను గుర్తించారు కదా అంటున్నారు...