నిజామాబాద్ జిల్లాలో కలకలం రేపుతున్న బీజేపీ కార్యకర్త అదృశ్యం 

నిజామాబాద్ జిల్లాలో కలకలం రేపుతున్న బీజేపీ కార్యకర్త అదృశ్యం 

నిజామాబాద్ : నిజామాబాద్ జిల్లాలో బీజేపీ కార్యకర్త అదృశ్యం కలకలం రేపుతోంది. భీంగల్ మండలం బడా భీంగల్ గ్రామానికి చెందిన లింగం అనే బీజేపీ కార్యకర్తను విచారణ పేరుతో అర్ధరాత్రి పోలీసులు తీసుకెళ్లారు. సోషల్ మీడియాలో పెడుతున్న పోస్టులపై కౌన్సిలింగ్ కోసం తీసుకెళ్తున్నామని, 15 నిమిషాల్లో ఇంటికి తిరిగి పంపిస్తామని తమకు పోలీసులు చెప్పి.. తీసుకెళ్లారని లింగం కుటుంబ సభ్యులు చెబుతున్నారు. అయితే.. అర్ధరాత్రి నుంచి లింగం ఆచూకీ తెలియకపోవడంతో గ్రామంలో ఆందోళన నెలకొంది. లింగం కోసం ఆయన కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఇప్పటికే అన్ని చోట్ల వెతికారు. 

పోలీసులే తమ కుమారుడిని ఏదో చేసుంటారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. మంత్రి ప్రశాంత్ రెడ్డి ఆదేశాలతోనే ఇదంతా జరుగుతున్నట్లు బీజేపీ కార్యకర్తలు ఆరోపణ చేస్తున్నారు. పోలీస్ స్టేషన్ వద్ద లింగం కుటుంబ సభ్యులు, బీజేపీ నేతలు, కార్యకర్తలు ఆందోళనకు దిగారు. లింగం ఆచూకీని కనిపెట్టాలంటూ డిమాండ్ చేశారు.