జీలం నదిలో పడవ బోల్తా.. ఆరుగురు మృతి

జీలం నదిలో పడవ బోల్తా.. ఆరుగురు మృతి

శ్రీనగర్: జమ్మూకాశ్మీర్‌‌లో పడవ ప్రమాదం జరిగింది. శ్రీనగర్‌‌ ఏరియాలోని జీలం నదిలో ప్యాసింజర్లతో కూడిన ఓ పడవ బోల్తా పడింది. ఈ ఘటనలో నలుగురు చిన్నారులు సహా ఆరుగురు చనిపోయారు. మరో 10 మంది గల్లంతయ్యారు. గల్లంతైన బోటు ప్రయాణికుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. నదిలో స్తంభాన్ని ఢీకొని పడవ బోల్తా పడిందని..ప్రమాద సమయంలో అందులో 20 మందికి పైగా ప్యాసింజర్లు ఉన్నారని అధికారులు వెల్లడించారు.

అందులోనూ ఎక్కువగా స్కూల్ పిల్లలేనని.. నది అవతల ఉన్న పాఠశాలకు వెళుతుండగా ప్రమాదం జరిగిందని వివరించారు. ఎమర్జెన్సీ బృందాలు రంగం లోకి దిగి సహాయక చర్యలను కొనసాగిస్తున్నాయని తెలిపారు. ఇప్పటిదాకా10 మంది ప్రయాణికులను రెస్క్యూ చేశారని, గల్లంతైన వారికోసం సెర్చ్ చేస్తున్నారని పేర్కొన్నారు. రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో జీలం సహా పలు నదుల నీటిమట్టం భారీగా పెరిగింది. కొండచరియలు విరిగిపడటంతో జమ్మూ-–శ్రీనగర్ హైవే కూడా మూసివేశారు.