బిల్డింగ్ పైనుండి పడి బాలుడు మృతి ..సంగారెడ్డి జిల్లా అమీన్‌‌‌‌పూర్‌‌‌‌ లో ఘటన

బిల్డింగ్ పైనుండి పడి బాలుడు మృతి ..సంగారెడ్డి జిల్లా అమీన్‌‌‌‌పూర్‌‌‌‌ లో ఘటన

రామచంద్రాపురం (అమీన్‌‌‌‌పూర్‌‌‌‌), వెలుగు : బిల్డింగ్‌‌‌‌ పైనుంచి పడి ఓ బాలుడు చనిపోయాడు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా అమీన్‌‌‌‌పూర్‌‌‌‌ లో ఆదివారం జరిగింది. వనపర్తి జిల్లా బలజపల్లి గ్రామానికి చెందిన మింగ గురుమూర్తి, నందిని దంపతులు తమ ఐదేండ్ల కొడుకు హర్షవర్ధన్‌‌‌‌తో కలిసి రెండు నెలల కింద అమీన్‌‌‌‌పూర్‌‌‌‌ పరిధిలోని హరివిల్లు టౌన్‌‌‌‌షిప్‌‌‌‌కు వచ్చి అద్దెకు ఉంటున్నారు. లారీ డ్రైవర్‌‌‌‌గా పనిచేస్తున్న గురుమూర్తి ఆదివారం మధ్యాహ్నం డ్యూటీకి వెళ్తుండడంతో హర్షవర్ధన్‌‌‌‌ బయటకు వచ్చి తండ్రికి టాటా చెప్పాడు. అనంతరం అక్కడే రెయిలింగ్‌‌‌‌ పట్టుకొని ఆడుకుంటుండగా ప్రమాదవశాత్తు జారి రెండో అంతస్తు నుంచి కిందపడ్డాడు. తీవ్రంగా గాయపడిన హర్షవర్దన్‌‌‌‌ అక్కడికక్కడే చనిపోయాడు.