
వరంగల్‌సిటీ, వెలుగు : గంజాయి రవాణా చేస్తున్న ఓ బాలుడితో పాటు మరో యువకుడిని శుక్రవారం వరంగల్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. కేసుకు సంబంధించిన వివరాలను వరంగల్ – ములుగు రోడ్డు సమీపంలోని నార్కోటిక్ పీఎస్‌లో డీఎస్పీ సైదులు వెల్లడించారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం... ఏపీలోని డొంకరాయి ప్రాంతానికి చెందిన 17 ఏండ్ల బాలుడితో పాటు అదే ఏరియాకు చెందిన మైలపల్లి మోహిత్ కలిసి బైక్‌పై గంజాయి తరలిస్తున్నారు.
ఈ విషయం పోలీసులకు తెలియడంతో వరంగల్ – నర్సంపేట రోడ్డులో బైక్‌ను ఆపి ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ. 26 లక్షల విలువైన గంజాయితో పాటు బైక్, రెండు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ వెల్లడించారు. మైనర్లకు తక్కువ శిక్ష పడే అవకాశం ఉండడం వల్లే గంజాయి తరలింపు, అమ్మకానికి వారిని ఎంచుకుంటున్నారని తెలుస్తోంది.