ఆరో అంతస్థు నుంచి దూకింది.. అయినా దానికేం కాలేదుగా..

ఆరో అంతస్థు నుంచి దూకింది.. అయినా దానికేం కాలేదుగా..

సహజంగా కొద్దిగా కాలు జారి కింద పడితేనే కుయ్యో మెర్రో అంటాం.  అలాంటిది ఓ భారీ బరువున్న పిల్లి ఆరో అంతస్థు నుంచి దూకినా దర్జాగా.. చలాకీగా  వెళ్లి దాని పని అది చేసుకుంది.  ఈ అరుదైన ఘటన బ్యాంకాంగ్ లో చోటు చేసుకుంది. 

ఆరో అంతస్థు నుంచి పడినా ..

ఆరు అంతస్థుల భవనంపై  ఓ పిల్లి ఉంది.   బాల్కనీలో ఉన్న పిల్లి ఒక్కసారిగా కిందకు దూకింది.  8.5 కిలోల బరువున్న పిల్లి అక్కడ పార్క్ చేసిన కారు అద్దంపై పడింది.  పిల్లికి ఏమీ కాలేదు కాని కారు యజమాని జేబుకు మాత్రం చిల్లి పడింది.  కారు అద్దానికి పెద్ద రంధ్రం  ఏర్పడటంతో కొత్త అద్దం మార్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.  బాల్కనీలో పిల్లి తన పట్టును కోల్పోవడంతో కింద పడింది. 

గతంలో ఓ పిల్లి పై నుంచి ఓ వృద్దుడి తలపై పడినప్పుడు అతను అపస్మారక స్థితిలోకి వెళ్లిన వీడియో వైరల్ అయింది.  ఈ వీడియో  ఈశాన్య చైనా ప్రావిన్స్ హీలాంగ్‌జియాంగ్‌లోని హర్బిన్ నగరంలో గోల్డెన్ రిట్రీవర్‌తో  గావో ఫెంగువా అనే వ్యక్తి పోస్ట్ చేశారు. అయితే ఆ వృద్దుడు స్పృహ లోకి వచ్చిన తరువాత పిల్లికి ఎలాంటి గాయాలు కాలేదని తెలిపాడు.  

కారు యజమాని అపివత్ టయోథాకా మే 27న ఈ వీడియోను తన పేస్ బుక్ లో పోస్ట్‌ చేశారు.  ఆరో అంతస్థు నుంచి దూకిన పిల్లి తన కారు అద్దాన్ని పగులకొట్టిందని తెలుసుకొని ఆశ్చర్యపోయానని వివరించాడు.  కారు వెనుకాల ఉన్న అద్దం పగిలింది కాని.. ఆ పిల్లికి ఎలాంటి గాయాలు కాలేదని తెలిపారు.  తాను నష్టపోయినప్పటికీ, పిల్లి ఎంత భయపడిందోనని  అపివత్ చెప్పాడు. అతను తన కారు కింద దాక్కున్న పిల్లిని గమనించాడు. అపివాట్‌లోని ఆరవ అంతస్తులోని బాల్కనీలో  సెక్యూరిటీ కెమెరా ఫుటేజీ లో ఈ వీడియో రికార్డ్ అయిందని  వెల్లడించారు.