
హనుమాన్(HanuMan) సినిమా ఓటీటీలో కూడా దుమ్ములేపుతోంది. మార్చ్ 17 నుండి ఈ సినిమా ప్రముఖ ఓటీటీ సంస్థ జీ5(Zee5)లో స్ట్రీమింగ్ కు వచ్చింది. ఎలాంటి అధికారిక ప్రకటన లేకుండా డైరెక్ట్ ఓటీటీకి వచ్చిన ఈ సినిమాను చూసి ప్రేక్షకులు అవాక్కయ్యారు. అంతేకాదు.. ఫ్యామిలీ అంత కలిసి ఓటీటీలో హనుమాన్ ను చేసి హ్యాపీగా ఫీలవుతున్నారు. దీంతో ఈ సినిమా ఓటీటీలో రికార్డ్ వ్యూస్ దక్కించుకుంటోంది. విడుదలైన కొన్ని గంటల్లోనే ఎక్కువ వ్యూస్ సాదిస్తుం ముందుకు దూసుకుపోతోంది.
ఇదిలా ఉంటే.. రీసెంట్ ఈ సినిమాను ఓటీటీలో చూస్తున్న ఓ చిన్నారి కన్నీళ్లుపెట్టుకుంది. హనుమాన్ సినిమా ఇంటర్వెల్ సమయంలో వచ్చే సీన్ లో విలన్ హీరోను కొట్టి కింద పడేస్తాడు. ఆ సీన్ చూస్తున్న చిన్నారి కన్నీళ్లుపెట్టుకుంది. హనుమాన్ సినిమా చూస్తూ.. కన్నీళ్లుపెట్టుకున్న తన కూతురు వీడియోను ఆ తండ్రి సోషల్ మీడియాలో అప్లోడ్ చేశాడు. చాలా క్యూట్ గా ఉన్న ఈ వీడియో క్షణాల్లో వైరల్ గా మారింది. ఆ వీడియో దర్శకుడు ప్రశాంత్ వర్మ వద్దకు చేరడంతో ఆయన కూడా ఈ వీడియో పై రిప్లై ఇచ్చాడు.
Awww ?? https://t.co/HlczCf7Ewx
— Prasanth Varma (@PrasanthVarma) March 18, 2024
ఇక హనుమాన్ సినిమా విషయానికి వస్తే.. ఈ సినిమాలో హీరో తేజ సజ్జ హీరోగా నటించగా.. అమృత అయ్యర్ హీరోయిన్ గా నటించారు. డివోషనల్ అండ్ సూపర్ హీరో కాన్సెప్ట్ తో వచ్చిన ఈ సినిమా ఆడియన్స్ ను మెస్మరైజ్ చేసింది. కథ, దాని ప్రెజెంట్ చేసిన వివాదనం, గ్రాఫిక్స్, ఇలా ప్రతీ ఎలిమెంట్ లో ప్రేక్షకులను అలరించింది ఈ మూవీ. ఇక చిన్న పిల్లలు మాత్రం ఈ సినిమాకు అడిక్ట్ అయిపోయారు.
ALSO READ :- కేసీఆర్ పాలన స్వర్ణ యుగం: ఆర్.ఎస్.ప్రవీణ్
హనుమంతులవారి సినిమా కాబట్టి ఈ సినిమా వారికి తెగ నచ్చేసింది. అసలు ఏ మాత్రం అంచనాలు లేకుండా వచ్చిన ఈ సినిమా ఏకంగా రూ.330 కోట్లు కలెక్ట్ చేసి రికార్డ్ క్రియేట్ చేసింది. ఇక ఈ సినిమాకు సీక్వెల్ గా జై హనుమాన్ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ సీక్వెల్ వచ్చే సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.