ఒక్క లోన్ స్టేట్ మెంట్ కు 55 వేల లెటర్లు

ఒక్క లోన్ స్టేట్ మెంట్ కు 55 వేల లెటర్లు

ఒకాయన తన కూతురు చదువు కోసం లోన్‌‌ తీసుకున్నడు. లోన్‌‌ స్టేట్‌‌మెంట్‌‌కు సంబంధించి ఆ కంపెనీ ఎన్ని లెటర్లు పంపాలె ? ఒకటో, రెండో మహా అయితే మూడో అంటరు. కానీ ఆ కంపెనీ ఏకంగా 55 వేల లెటర్లను పంపింది. వాటిని తీసుకోవడానికి పోస్టాఫీస్‌‌కు వెళ్లిన ఆ వ్యక్తి ఆ లెటర్ల డబ్బాలను చూసి ఆశ్చర్యపోయాడు. అమెరికాలోని ఓహియోలో జరిగిందీ సంఘటన. లెటర్లు పంపిన కంపెనీ పేరు కాలేజ్‌ అవెన్యూ స్టూడెంట్‌‌ లోన్‌‌ కంపెనీ. లోన్‌‌ తీసుకున్న వ్యక్తి డాన్‌‌ కెయిన్‌‌. అసలు అన్ని లెటర్లు ఎందుకు పంపారని కంపెనీని కెయిన్‌‌ అడగ్గా మెయిల్‌‌లో టెక్నికల్‌‌ సమస్య వల్ల అలా జరిగిందని చెప్పింది. పైగా తప్పుడు ఇంట్రెస్ట్‌‌తో స్టేట్‌‌మెంట్‌‌ పంపారని కంపెనీకి కెయిన్‌‌ చెబితే త్వరలో కొత్త మెయిల్‌‌ పంపుతామని తెలిపింది. ఈ సారి మాత్రం ఒకటే మెయిల్‌‌ పంపాలని కంపెనీకి కెయిన్‌‌ సరదాగా వార్నింగ్‌‌ ఇచ్చారు. ఏదేమైనా పోస్టాఫీస్‌‌లో ఉన్న ఆ పనికి రాని లెటర్లన్నిం టినీ  కెయిన్‌‌ ఇంటికి తీసుకెళ్లాల్సి వచ్చింది. చిన్న తప్పువల్ల కంపెనీకి భారీగా నష్టం జరిగిందని, లెటర్లన్నింటికీ కలిపి 7 లక్షల నుంచి 8లక్షల వరకు ఖర్చయి ఉంటుందని కెయిన్‌‌ లెక్కేశాడు.