ఈవీఎంలపై పూర్తిస్థాయి అవగాహన తప్పనిసరి

ఈవీఎంలపై పూర్తిస్థాయి అవగాహన తప్పనిసరి

నిర్మల్/నస్పూర్/కాగజ్ నగర్, వెలుగు: పోలింగ్ డ్యూటీలతోపాటు ఈవీఎం యంత్రాల పనితీరుపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని నిర్మల్​జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్​ఎన్నికల సిబ్బందికి సూచించారు. పట్టణంలోని సెయింట్ థామస్ స్కూల్​లో అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన ప్రిసైడింగ్, అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులకు సోమవారం జరిగిన శిక్షణ కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు.

ఎలక్షన్ డ్యూటీలో పీఓ, ఏపీఓల పాత్ర కీలకమన్నారు. బ్యాలెట్, కంట్రోల్ యూనిట్, వీవీ ప్యాట్లను పోలింగ్ కేంద్రాల్లో అమర్చడం, మాక్ పోలింగ్ నిర్వహణపై తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో డీఈఓ, శిక్షణ నోడల్ అధికారి రవీంద ర్ రెడ్డి, డీఆర్ఓ భుజంగరావు, మాస్టర్ ట్రైనర్స్ శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఎలక్షన్​ కోడ్​ను కచ్చితంగా అమలు చేయాలి

జిల్లాలో ఎలక్షన్ ​కోడ్​ను కచ్చితంగా అమలు చేయాలని మంచిర్యాల జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ బదావత్ సంతోష్ తెలిపారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రిసైడింగ్, సహాయ ప్రిసైడింగ్, ఇతర ప్రిసైడింగ్ అధికారులకు ఏర్పాటు చేసిన శిక్షణ కార్యక్రమానికి అడిషనల్ కలెక్టర్ సబావత్ మోతిలాల్, మంచిర్యాల ఆర్డీఓ రాములుతో కలిసి హాజరయ్యారు.

ఎన్నికలకు సంబంధించిన ప్రతి అంశంపై అప్రమత్తంగా ఉండాలని, ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా పకడ్బందీగా విధులు నిర్వహించాలని ఆదేశించారు. శిక్షణ తీసుకుంటున్న అధికారులు తమకు అందించిన హ్యాండ్ బుక్​పై పూర్తి అవగాహన కలిగి ఉండాలన్నారు. ప్రిసైడింగ్, సహాయ ప్రిసైడింగ్, ఇతర ప్రిసైడింగ్ అధికారులు, ఎన్నికల విభాగం అధికారులు పాల్గొన్నారు.

ఓటర్లకు ఇబ్బందుల్లేకుండా చూడాలి

పోలింగ్ నాడు ఓటర్లు ఎలాంటి ఇబ్బందులకు గురికాకుండా చూడాలని, ఇందుకు ప్రిసైడింగ్ ఆఫీసర్లు, అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్లు చర్యలు తీసుకోవాలని ఆసిఫాబాద్ కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే అన్నారు. కాగజ్ నగర్ పట్టణంలోని వివేకానంద డిగ్రీ కాలేజీలో ఏర్పాటుచేసిన ప్రిసైడింగ్ అధికారులు, సహాయ ప్రిసైడింగ్ అధికారుల శిక్షణ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్​ దీపక్ తివారి, ఆర్డీఓ సురేశ్ తో కలిసి పాల్గొన్నారు. పోలింగ్ అధికారులకు, సహాయ పోలింగ్ అధికారులు ఎన్నికల రోజు చేపట్టాల్సిన విధులపై సూచనలు, సలహాలు ఇచ్చారు.