జీబ్రా క్రాసింగ్ మీదుగా వెళ్లి రోడ్డు దాటిన జింక

 జీబ్రా క్రాసింగ్ మీదుగా వెళ్లి రోడ్డు దాటిన జింక

మన దేశంలో కొంతమందికి రోడ్డు దాటాలంటే జీబ్రా క్రాసింగ్‌ అక్కర్లేదు. చేయి చూపించి ట్రాఫిక్‌ను పట్టించుకోకుండా రోడ్డు దాటుతుంటారు. దానివల్ల ట్రాఫిక్ జామ్‌ అవుతుంది. లేదా యాక్సిడెంట్లు జరుగుతాయి. అలాంటి వాళ్లను దృష్టిలో పెట్టుకొని ఉత్తర‌ ప్రదేశ్‌ పోలీస్‌లు ఒక జింక జీబ్రా క్రాసింగ్ మీదుగా రోడ్డు దాటుతున్న వీడియోను ‘యుపి పోలీస్’ ట్విట్టర్ అకౌంట్‌లో ట్వీట్‌ చేశారు. ఆ ట్వీట్​ క్యాప్షన్​ – ‘రోడ్డు దాటే వాళ్లు రెడ్‌ సిగ్నల్‌ పడే వరకు ఆగి, జీబ్రా క్రాసింగ్ మీద నుంచే వెళ్లండి. సురక్షితంగా ఉండండి’. 

ఈ వీడియోలో జింక రోడ్డు దాటడానికి జీబ్రా క్రాసింగ్ దగ్గర నిలబడి ఉంటుంది. గ్రీన్​ సిగ్నల్‌ పడే వరకు జింక అక్కడే ఉంటుంది. తరువాత మెల్లగా జీబ్రా క్రాసింగ్‌ మీద నడుచుకుంటూ రోడ్డు దాటి వెళ్లిపోతుంది.