జింక వెంటపడ్డ కుక్కలు..కాపాడిన గ్రామస్థులు

జింక వెంటపడ్డ కుక్కలు..కాపాడిన గ్రామస్థులు

చిత్తూరు జిల్లా వెంకటగిరి కోట పట్టణంలోకి ఓ జింక దారి తప్పి వచ్చింది.  అడవిలోకి వెళ్లాల్సింది పోయి....దారి తప్పి టౌన్ లోకి ఎంటర్‌ అయ్యింది.  దీంతో పట్టణంలోని ఉన్న కుక్కలు జింక వెంటపడ్డాయి.  దానిపై దాడి చేయబోవడంతో...కుక్కల నుంచి తప్పించుకొని ప్రభుత్వ బాలుర స్కూల్ లోని నీటి తోటిలో జింక పడింది. దీనిని గమనించిన స్థానికులు ఆ జింకను కాపాడారు. అనంతరం విషయాన్ని అటవీ శాఖ అధికారులకు తెలియజేశారు. వెంటనే వెంకటగిరికోటకు వచ్చిన అటవీ శాఖ అధికారులు..జింకకు ప్రథమ చికిత్స చేసి అడవిలోకి వదిలారు. జింకకు ఎలాంటి ప్రాణాపాయం లేదని వైద్యులు తెలిపారు.