మద్యం మత్తులో పోలీసులతో డాక్టర్ వాగ్వాదం

మద్యం మత్తులో పోలీసులతో డాక్టర్ వాగ్వాదం

ఫూటుగా మద్యం సేవించి ట్రాఫిక్ పోలీసులకు ఓ డాక్టర్ అర్దరాత్రి చుక్కలు చూపించాడు. హైదరాబాద్ పాతబస్తీ మీర్ చౌక్ పోలీసులు చంపాపేట్ లో డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. ఆ సమయంలో పీకలదాకా తాగిన ఓ డాక్టర్  వాహనాన్ని పోలీసులు ఆపేశారు. అంతే అతడికి చిర్రెత్తుకొచ్చింది. పోలీసులపై దురుసుగా మాట్లాడాడు. తనను ఎందుకు ఆపేశారని వారిని నిలదీశారు. మద్యం మత్తులో చట్టాలు,రూల్స్ అంటూ పోలీసులతో వాగ్వాదానికి దిగాడు. ఆ సమయంలో అటుగా వెళ్తున్న కొందరు వాహనదారులు చోద్యం చూసినట్టు చూశారు. 

మరిన్ని వార్తల కోసం

 

తెలంగాణ ప్రజలను కేసీఆర్ మోసం చేసిండు

గ్రూప్​ 1  ప్రిలిమ్స్​ ప్రిపరేషన్​ ప్లాన్​