తీర్థయాత్రకు వెళ్తుంటే ఘోరం: ఏడుగురు స్పాట్‌డెడ్

తీర్థయాత్రకు వెళ్తుంటే ఘోరం: ఏడుగురు స్పాట్‌డెడ్

హరియాణాలో శుక్రవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అంబాలా-ఢిల్లీ-జమ్మూకాశ్మీర్ హైవేలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు, ట్రక్కు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో తీర్థయాత్రికులు ఏడుగురు అక్కడికక్కడే చనిపోయారు. 20మందికి తీవ్ర గాయాలైయ్యాయి. వారంతా మాతా వైష్ణో దేవి పుణ్యక్షేత్రానికి వెళ్తున్నారు. గాయపడ్డవారిని స్థానిక హాస్పిటల్ కు తరలించారు.

ప్రమాదంలో బస్సు ముందు సగం మొత్తం నుజ్జునుజ్జు అయింది. తెల్లవారుజామున ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. ప్రమాదంపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. యాక్సిడెంట్ కు గల కారణాలు ఆరా తీస్తున్నారు.