కొడుకును చంపి మూసీలో పడేసి.. ఆపై కనిపించడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు.. హైదరాబాద్లో ఓ తండ్రి ఘాతుకం

కొడుకును చంపి మూసీలో పడేసి.. ఆపై కనిపించడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు.. హైదరాబాద్లో ఓ తండ్రి ఘాతుకం

హైదరాబాద్ లో దారుణ ఘటన చోటు చేసుకుంది. కొడుకును చంపేసి మూసీ నదిలో పడేశాడు ఓ కసాయి తండ్రి. ఆ తర్వాత డౌట్ రాకుండా ఉండేందుకు నేరుగా పోలీస్ స్టేషన్ కు వెళ్లి కొడుకు కనబడటం లేదని  ఫిర్యాదు చేశాడు. ఈ షాకింగ్ ఇన్సిడెంట్ పాతబస్తీ బండ్లగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. 

పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం.. బండ్లగూడ కు చెందిన  మహమ్మద్ అక్బర్ అనే వ్యక్తి..  అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న కొడుకుని హత్య చేశాడు. అనంతరం బాలుడు మృతదేహాన్ని సంచిలో తీసుకెళ్లి నయా పుల్ బ్రిడ్జి పైనుంచి మూసిలో పడేశాడు. ఆ తర్వాత బాబు కనిపించడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

అక్బర్  పై అనుమానంతో పోలీసులు విచారించగా..  కొడుకును తానే చంపినట్లు ఎట్టకేలకు నిజం ఒప్పుకున్నాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

బండ్లగూడ పోలీస్ సిబ్బందితో పాటు, హైడ్రా NDRF అధికారులi మూసిలో బాలుడి మృతదేహం కోసం గాలింపు చర్యలు చేపట్టారు. పోలీస్ ఇన్వెస్టిగేషన్ లో తండ్రి చెప్పిన సమాచారం మేరకు మూసిలో జల్లెడ పడుతున్నారు పోలీసులు.

శనివారం (సెప్టెంబర్ 13) రాత్రంతా మూసీ నదిలో గాలించినా.. పోలీసులకు బాబు మృతదేహం లభించలేదు. ఆదివారం మరోసారి మూసీ నదిలో బాబు మృతదేహం కోసం గాలిస్తున్నా పోలీసులు.