పెండ్లి వేడుకలో గొడవ.. విషం తాగిన వధూవరులు

పెండ్లి వేడుకలో గొడవ.. విషం తాగిన వధూవరులు

ఇండోర్ : వివాహ వేడుకలో వధూవరుల మధ్య జరిగిన గొడవ విషాదానికి దారితీసింది. వధూవరులు ఇద్దరూ పాయిజన్​ తాగడంతో పెళ్లికొడుకు మృతిచెందగా పెళ్లికూతురు పరిస్థితి సీరియస్​గా ఉంది.  కనాడియా ఏరియాలోని ఆర్యసమాజ్​ టెంపుల్​లో  వివాహ వేడుకలో గొడవ జరిగింది.  మనస్తాపంతో  వరుడు విషం తాగి  ఈ విషయాన్ని వధువుకు చెప్పాడు. దీంతో వధువు కూడా విషం తాగింది. వీరిని వెంటనే ఆసుపత్రికి తరలించగా అప్పటికే పెండ్లికొడుకు మృతిచెందాడు.

పెండ్లికూతురు పరిస్థితి సీరియస్​గా ఉండటంతో లైఫ్​ సపోర్టు సిస్టమ్​తో చికిత్స అందిస్తున్నారు.  కాగా,  పెండ్లి చేసుకోవాలని వధువు ఒత్తిడి చేయడంతోనే తమ కొడుకు పాయిజన్​ తాగాడని మృతుడి తల్లిదండ్రులు చెప్పారు. కెరీర్లో స్థిరపడేందుకు రెండేండ్లు గడువు కోరినా యువతి నిరాకరించి పోలీస్​ కంప్లయింట్​ ఇచ్చినందుకే పెండ్లి జరిగిన అనంతరం తమ కుమారుడు సూసైడ్​ చేసుకున్నాడన్నారు.