మాస్ కాంబో రిపీట్ ..రవితేజతో మూడో చిత్రం..హరీష్‌‌ శంకర్

మాస్ కాంబో రిపీట్ ..రవితేజతో మూడో చిత్రం..హరీష్‌‌ శంకర్

సంక్రాంతికి ‘ఈగల్‌‌’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకొస్తున్న రవితేజ.. తాజాగా మరో కొత్త చిత్రానికి సైన్ చేశాడు. ఆయన హీరోగా హరీష్‌‌ శంకర్ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కబోతోంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌‌ పై టీజీ విశ్వ ప్రసాద్ నిర్మిస్తున్నారు.

వివేక్ కూచిభొట్ల కో ప్రొడ్యూసర్. బుధవారం ఈ చిత్రాన్ని అధికారికంగా ప్రకటించారు. రవితేజ, హరీష్‌‌ కాంబినేషన్‌‌లో వస్తున్న మూడో చిత్రమిది. ‘షాక్‌‌’ సినిమాతో హరీష్‌‌కు దర్శకుడిగా మొదటి అవకాశాన్ని ఇచ్చాడు రవితేజ. ఆ తర్వాత వీళ్లిద్దరి కాంబినేషన్‌‌లో ‘మిరపకాయ్‌‌’ లాంటి సూపర్ హిట్‌‌ సినిమా వచ్చింది.

ఆ సినిమాతో రవితేజకు మాస్‌‌ మహారాజా అనే ట్యాగ్ ఇచ్చాడు హరీష్. ఇక ‘ధమాకా’ తర్వాత పీపుల్స్ మీడియా సంస్థలో రవతేజ నటిస్తున్న చిత్రమిది. దీంతో ఈ ముగ్గురి కాంబినేషన్‌‌లో రానున్న సినిమా కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.