కర్నాటక మత్స్యకారుడు వలకు చిక్కిన అరుదైన పీత శిలాజం

కర్నాటక మత్స్యకారుడు వలకు చిక్కిన అరుదైన పీత శిలాజం

కర్ణాటకలో ఓ మత్స్యకారుడికి అరుదైన శిలాజం దొరికింది. ఈశ్వర్ హరికాంత్ అనే వ్యక్తి ఈ మధ్యే అఘ్నాశిని నది వద్దకు చేపల వేట కోసం వెళ్లాడు. అక్కడ చేపలు పడుతుండగా... అతనికి రాయిలా కనిపించిన ఒక శిలాజాన్ని చూశాడు. అది కొత్తగా.. కాస్త వింతగా అనిపించడంతో దాన్ని తన చేతులోకి తీసుకున్నాడు. అయితే.. అది రాయినా...? లేక ఏదైనా జీవి శిలాజమా అనే విషయం అర్థం కాక.. దాన్ని తన వెంట తీసుకెళ్లాడు.  

బైతకోల్ కార్వార్‌కు చెందిన మత్స్యకార సంఘం అధ్యక్షుడు వినాయక్ వద్దకు తనకు దొరికిన శిలాజాన్ని హరికాంత్ తీసుకెళ్లాడు. దాన్ని అతడికి చూపించాడు. వాళ్లు కూడా వింతగా చూశారు. ఏంటో ఇది అని చర్చించుకున్నారు. ఇది హరికాంత్ కు దొరకడం ఒక అద్భుతమని కొనియాడారు. 

ఈ విషయం ఆ నోట ఈనోట అందరికీ తెలిసింది. దీనిపై పరిశోధన చేసిన వీఎన్ నాయక్ కీలక విషయాలు వెల్లడించాడు. ఇలాంటి శిలాజం తాగు నీటిలో కనుగొనడం ఇదే మొదటిసారి అని చెప్పారు. శిలాజానికి వందల సంవత్సరాల వయస్సు ఉంటే, అది కార్బన్ డేటింగ్ ద్వారా నిర్ధారించబడుతుందన్నారు. ఈశిలాజం పీతకు సంబంధించినది అయ్యి ఉండొచ్చని అభిప్రాయపడ్డారు. ఇలాంటివి సముద్రగర్భంలో ఎక్కువగా కనిపిస్తాయన్నారు. అయితే.. ఇది నదిలో కనిపించడం ఇదే మొదటిసారి అని చెప్పారు. 

మొత్తంగా హరికాంత్ రాయి లాంటి పీత శిలాజాన్ని కనుగొనడం ఇతర మత్స్యకారులకు ఆశ్చర్యం కలిగించింది. మొత్తంగా దాన్ని పీతకు సంబంధించిన శిలాజమని గుర్తించారు. మరొకొందరు మాత్రం దాన్ని రాయిలానే భావిస్తున్నారు. 

అంతకుముందు.. 2023, ఆగస్టులో జపాన్‌లోని టోక్యోలో అంతరించిపోయిన పీత శిలాజం కనుగొన్నారు. టోక్యో స్టేషన్ గోడలలో శిలాజాన్ని గుర్తించారు. ఈ శిలాజం సుమారు 30 మిలియన్ సంవత్సరాల క్రితం అంతరించిపోయిన పీతకు సంబంధించినదని గుర్తించారు. 

న్యూజిలాండ్‌కు చెందిన ఒక పాలియోంటాలజిస్ట్ 12 మిలియన్ సంవత్సరాల నాటి పీత శిలాజాన్ని గుర్తించాడు. ఆయన దాన్ని క్రైస్ట్‌చర్చ్‌లోని బీచ్‌లో కనుగొన్నాడు.