నెలరోజుల పైగా కోమా..ఆ తరువాత కరోనా : వైరస్ ను జయించిన ఐదునెలల బుడ్డోడు

నెలరోజుల పైగా కోమా..ఆ తరువాత కరోనా : వైరస్ ను జయించిన ఐదునెలల బుడ్డోడు

వయసుతో సంబంధంలేకుండా కబళిస్తోంది. విస్మరిస్తేప్రాణాలమీదికి వస్తోంది. సరైన అవగాహన లేకపోతే మింగేస్తుంది ఈ కరోనా. అంతటి మహమ్మారి దెబ్బకు ప్రపంచ దేశాలు ఉక్కిరి బిక్కిరి అవుతున్నాయి. కానీ  ఐదు నెలల బుడ్డోడు కరోనాకు అదరలేదు బెదరలేదు.

బ్రెజిల్ కు చెందిన బేబీ డామ్ ఇంట్లో పార్టీ జరిగింది.  ఆ పార్టీలో కరోనా సోకినట్లు డామ్ తండ్రి సీఎన్ ఎన్ కు తెలిపాడు.  పార్టీ జరిగిన కొద్ది రోజులకు డామ్ కు అనారోగ్యం తలెత్తితే  ఆస్పత్రికి తరలించామన్నారు. ఆస్పత్రిలో ట్రీట్ మెంట్ జరిగే సమయంలో డామ్ కోమాలోకి వెళ్లాడని…34రోజుల తరువాత స్పృహలోకి వచ్చాడని అన్నారు. అయితే స్పృహలోకి వచ్చిన ఆనందం ఎక్కువ సేపు నిలవలేదన్నారు. ఓ రోజు తామిద్దరం ఆస్పత్రికి వెళ్లగా తన కుమారుడికి జలుబు, దగ్గు వచ్చిందని టెస్ట్ లు చేయగా అందులో ఏదో ఇన్‌ఫెక్షన్ వల్ల అనారోగ్యానికి గురైనట్లు డాక్టర్లు చెప్పారని తెలిపారు. అత్యవసర చికిత్స కోసం మరో ఆస్పత్రికి తరలించగా కరోనా సోకినట్లు తేలిందని డామ్ తండ్రి వెల్లడించారు. ప్రస్తుతం డామ్ కు కరోనా తగ్గిందని , త్వరలో డిశ్చార్జ్ అవుతున్న ట్లు తండ్రి ఆనందం వ్యక్తం చేశాడు.