గుండెపోటుతో ఐదేళ్ల చిన్నారి మృతి

గుండెపోటుతో ఐదేళ్ల చిన్నారి మృతి

కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో విషాదం చోటుచేసుకుంది. గుండె పోటుతో 5 ఏళ్ళ చిన్నారి ఉక్కులు(5)  మృతి చెందింది.  అక్టోబర్ 15న  స్కూల్ కు  వెళ్లే క్రమంలో కళ్లు తిరుగుతున్నాయని చిన్నారి చెప్పింది. దీంతో వెంటనే  ఓ ప్రైవేట్ ఆస్పత్రికి అక్కడి నుంచి హనుమకొండకు తీసుకెళ్లారు తల్లిదండ్రులు. గుండె సమస్యతో అప్పటికే మృతి చెందినట్లు చెప్పారు డాక్టర్లు.  

చిన్నారి  పేరెంట్స్ రాజు -జమునల స్వస్థలం జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలంలోని పంగిడిపల్లి.   కొడుకు, కూతురుతో కలిసి జమ్మికుంటలో ఉంటున్నారు దంపతులు. ఆడుతూ పాడుతూ ఉండే చిన్నారి మృతితో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు.